Harish Rao : కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజమన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా మొండి చేయి చూపింది. ఒకటో ఫేస్, రెండో ఫేస్ లో ఇవ్వలేదు, మోడో ఫేస్ లో ఇస్తామని చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం.
Also Read : Tunisha Sharma Death Case: తునీషా శర్మ హత్య కేసులో షీజాన్ కు బెయిల్
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే, మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజ్ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయాము అని చెబుతారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు.? కేంద్రం మెడికల్ కాలేజీ ఇవ్వకున్నా, పైసా నిధులు మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రం సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలు ప్రారంబించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉండటం వాస్తవం కాదా? .. ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?
Also Read : Oxygen Plant Blast : ‘బంగ్లా’లోని ఆక్సీజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. మృతులను లెక్కిస్తున్న రెస్క్యూ
4, గతంలో బీబీనగర్ ఎయిమ్స్ కి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి నాలుక కరుచుకున్నరు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. డిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు గల్లీ లోని మా పి హెచ్ సి స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ. 1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ. 156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018 లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్ కి 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా? ఈ అన్యాయాల గురించి ఎందుకు ఒక్కరు మాట్లాడరు? ఎందుకు తెలంగాణ ప్రయోజనాల గురించి కేంద్రాన్ని నిలదీయరు?? ఏపీ పునర్ విభజన చట్టం -2014 లో ఇచ్చిన హామీల మేరకు ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్ భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినవారు అవుతారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!