Kapil Sibal: ప్రముఖ న్యాయవాది, మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ బీజేపీపై పోరాటానికి సిద్ధం అయ్యారు. దీని కోసం కొత్త వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్’ అనే వేదికను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ‘ఇన్సాఫ్ కే సిపాహి’ పేరిట వెబ్ సైట్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలపై లాయర్లు పోరాటా చేస్తారని అన్నారు. దీనికి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వాలని కోరారు.
Read Also: Vikarabad : టీచర్ కొట్టడం వల్లే మా కొడుకు చనిపోయాడు
దేశంలో ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలను విస్తరిస్తోందని, దీని వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్నికైన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టిందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపు దారులకు 10వ షెడ్యూల్ వరంగా మారిందని అన్నారు. రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రస్తుత పాలనలో దుర్వినియోగం అవుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సీబీఐ పనిచేయదని, ఈడీ ఎక్కడికైనా వెళ్లవచ్చని సిబల్ అన్నారు. మనం ప్రభుత్వం వర్సెస్ ప్రజలు అనే పరిస్థితిలో ఉన్నామని అన్నారు. మేము పౌరుల కోసం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కర్ణాటకలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు రూ. 6 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని, ఎమ్మెల్యే కుమారుడిపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.