MK Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలోకి రాకుండా చూడటం, ప్రధాని మోదీ మళ్లీ ప్రధాని కాకుండా చూడటం తమ లక్ష్యమని, విపక్షాలు అందుకోసమే ప్రయత్నిస్తున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లా కోరడంపై మాట్లాడుతూ.. తాను ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనే నిమగ్నమై ఉన్నానని స్టాలిన్ అన్నారు.
Rajnath Singh On Rahul Gandhi: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ సాయుధబలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నానని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో నందగఢ్ లో బీజేపీ ‘‘విజయ్ సంకల్ఫ్ యాత్ర’’ రెండో విడతను ప్రారంభించిన ఆయన, వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మరోసారి…
ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Tripura Election Results: ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే త్రిపులో బీజేపీ భారీ విజయం సాధించింది. కమ్యూనిస్టుల కంచుకోటను కూల్చిన బీజేపీ వరసగా రెండో సారి ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఈ రోజు వెల్లడించిన అసెంబ్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ స్థానాలు సాధించింది. త్రిపులో మొత్తం 60 స్థానాలు ఉంటే ఇప్పటికే బీజేపీ 34 చోట్ల విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 26 చోట్ల విజయం…
BJP: జాతీయ పార్టీల నిధుల్లో బీజేపీ టాప్ లో నిలిచింది. ఏకంగా సగానికి పైగా నిధులు ఒక్క భారతీయ జనతా పార్టీకే వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2020-21లో అన్ని జాతీయ పార్టీల మొత్తం నిధుల్లో 58 శాతం నిధులు బీజేపీకి వచ్చాయి. 2021-22లో నాలుగు జాతీయ పార్టీలు తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతాన్ని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయి.
Vishnuvardhan Reddy: టీడీపీ 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదు.. కానీ, బీజేపీ, జనసేన పార్టీతో కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతుందని పేర్కొన్నారు.. రాయలసీమకు సంబంధించిన చంద్రబాబు, వైఎస్ జగన్.. రాయలసీమను మోసం చేశారని విమర్శించారు.. మేం అధికారంలోకి వస్తే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.. అయితే, ఏపీలో…