DK Aruna: ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల వెనుక బిజెపి కక్షసాధింపు ఏమీ లేదన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లే అధికారంలో వచ్చింది మొదలు అందరిపై కక్షసాధింపుకు దిగిన బిఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి అందరూ అలాగే చేస్తారని అనిపిస్తున్నట్లుందని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు నిజంగానే లిక్కర్ స్కామ్ తో సంబంధం లేకుంటే ఈడీ విచారణలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవచ్చని తన నిజాయతీని నిరూపించుకోవచ్చని అన్నారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారు పదే పదే కవిత పేరు ఎందుకు చెబుతున్నారో తెలియాలన్నారు. కవిత కుటుంబానికి ఆపద వచ్చిన ప్రతీ సారి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. కవితను విచారణకు పిలిస్తే తెలంగాణ సమాజాన్నే అవమానిస్తున్నట్లు బిఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా కల్వకుంట్ల కుంటుంబంపై ఆరోపణలు వస్తే తెలంగాణ సమాజమే ఎదుర్కొన్నట్లు.. తెలంగాణ సమాజమే స్కామ్ కు పాల్పడినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కాగా.. ఈడీ నోటీసులు వస్తాయని సమాచారం వుండే కవిత మహిళా రిజర్వేషన్ల ధర్నా డ్రామా ఆడుతున్నట్లు అనుమానాలున్నాయని డికె అరుణ ఈసందర్బంగా మాట్లాడుతూ ఆరోపనలు గుప్పించారు.
Read also:MLC Kavitha: కవితకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మద్దతు.. దీక్షకు హాజరుకానున్న 16 పార్టీల ప్రతినిధులు..
ఇది ఇలా ఉండగా.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఇప్పుడు హాట్ టాపిక్. ఢిల్లీ ఈడీ కార్యాలనికి రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈనేపథ్యంలో కవిత ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సంచలంగా మారింది. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని ఈడికి ఎమ్మెల్సీ కవిత లేఖరాశారు. తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్ కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేయని తేల్చి చెప్పారు కవిత. హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడిని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు. ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని తెలియజేశారు.
Naveen murder case: కత్తిని ముందే లవర్‌కు చూపిన హరిహరకృష్ణ.. నవీన్ శరీరబాగాలను హసన్ ఇంట్లో..