పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకుంది.
బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
PM To Open Karnataka Expressway: మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ పెద్దలతో పాటు ప్రధాని నరేంద్రమోదీ వరసగా కర్ణాటకకు వెళ్తున్నారు. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే ప్రధాని ఆరుసార్లు కర్ణాటకకు వెళ్లారు.
Karnataka: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడి ప్రజాప్రతినిధులు. ఇప్పటికే కర్ణాటకలో టిప్పు వర్సెస్ సావర్కర్ వివాదం కొనసాగుతూనే ఉంది.
Pragya Thakur: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూకేలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గరంగరం అవుతోంది. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ.. భారత దేశంలో ప్రజాస్వామ్యంపై, మీడియాపై అణిచివేత కొనసాగుతోందని, మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు దాడులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. లండన్ లో మాట్లాడుతూ.. పార్లమెంట్ విపక్షాలు మాట్లాడే సమయంలో మైకులు కట్ చేస్తున్నాంటూ వ్యాఖ్యానించారు.
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది.. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఇది చెబుతూనే ఉన్నారు.. ఇక, త్వరలో కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు.. దీంతో.. కొత్తగా వచ్చే నేతలు.. జనసేనతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.. రాజకీయాల్లో పరిస్థితి మారుతుంటాయి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏమి జరుగుతుందో మీరు కూడా చూస్తుండాలి.. త్వరలోనే కీలకమైన నేతలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరతారని వెల్లడించారు…
Satya Kumar: తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉన్నాయి.. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం కేసీఆర్ మరిచిపోయారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరాలని చూసినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.. దొంగ దొరికి పోతున్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు.. ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు…