ఢిల్లీ లిక్కర్ స్కాం ఘటనలో మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ వచ్చి ఢిల్లీలో మకాం వేశారని, ఈడీ విచారణలో కవిత సహకరించ లేదని సమాచారమన్నారు. ఎందుకు ఏమిటి ఎలా అని ఈడి ప్రశ్నిస్తే.. ఏమో తెలియదు గుర్తు లేదు అని చెప్పిందట అని ఆయన విమర్శించారు. ఈడీ విచారణకు సహకరించక పోతే, తొందరగా అరెస్ట్ చేస్తారని, తప్పు చేసినందుకు టెన్షన్ పడుతున్నారన్నారు. ఇలాగే అన్ని వ్యవహారాల్లో నాయకులు స్పందించాలని, మహిళలపై తెలంగాణలో క్రైం పెరిగి పోయింది..
కవిత మీదా ఉన్న పది శాతం ప్రజల మీద పెట్టాలన్నారు.
Also Read : Militants Surrender: అరుణాచల్‌లో ఆయుధాలతో లొంగిపోయిన 15 మంది ఉగ్రవాదులు
కేసీఆర్, కవితలు ఒత్తిడి చేయడం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై .. ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళాడన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందని, కేసీఆర్ రాజీనామా చేసి, ఎన్నికలకు పోవాలన్నారు. ఇలాంటి దగాకొర్ల ఉబిలో పడి మాగుంట ఇరుక్కున్నారని, రాజకీయాల్లో అంటరాని వాళ్లు కల్వకుంట్ల కుటుంబం అని, వాళ్లకు దూరంగా ఉండాలని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే వ్యాపారస్తులకు మంచిదని ఆయన హితవు పలికారు. కడిగిన ముత్యం అయితే కవిత హడావిడి లేకుండా ఈడీ ముందు హాజరు కావాలన్నారు. ఈడీకి సహకరించాలన్నారు. అలాగే.. కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై అరవింద్ స్పందిస్తూ.. బండి సంజయ్ వాఖ్యలను సమర్డించను. ఆయన వాఖ్యలకు ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారు. సంజయ్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతం.. బీజేపీకి ఈ మాటలకు సంబంధం లేదు. బండి సంజయ్ కామెంట్స్.. వాళ్లకు ఓ ఆయుధం లా మారాయి.. అధ్యక్ష పదవి అది పవర్ సెంటర్ కాదు.. కో ఆర్డినేషన్ సెంటర్. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి’ అని ఆయన అన్నారు.
Also Read : Harirama Jogaiah: జగన్ పోవాలి, పవన్ రావాలి.. ఇదే కాపు సంక్షేమ సేన లక్ష్యం