తృణమూల్ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే మోషన్ను చదివే సమయంలో తమ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం అవినీతి కేసులకు మద్దతు ఇచ్చినట్లే అవుతుందని పేర్కొంటూ బీజేపీ సభను వాకౌట్ చేసింది.
Dokka Manikya Vara Prasad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేశారు.. అయితే, ఆయన చేరికను బీజేపీ నేతలు ఆహ్వానిస్తుంటే.. ఆయనపై మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం వలన వారికి ఒక్క ఓటు మాత్రమే వస్తుందని.. కిరణ్ కుమార్…
దేశవ్యాప్తంగా ఇప్పుడు నాటు నాటు పాట గురించే చర్చ. భారతీయ సిసినిమా అందులోనూ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడం సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించిడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కార్యక్రమాలను మాఫియా ద్వారా స్వాగతిస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆరోపించారు.
రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. టి నుంచి ప్రారంభం కానున్న రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ చేపట్టనున్నారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.