TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపైమరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లీకేజీ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు సిద్ధమైయ్యారు.
Ralso Read:CM Jagna: ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్.. రాజధానిపై చర్చ?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని డిమాండ్ చేస్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉదయం 10.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేయనున్నారు. బండి సంజయ్ మొదట బీజేపీ నాయకులతో కలిసి ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. గన్ పార్క్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ వెళ్తారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్షలో పాల్గొంటారు.
Ralso Read: Freddy Cyclone: ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం.. 326 మంది మృతి
కాగా, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. లీకేజీ వ్యవహారానికి నిరసనగా ధర్నా చేసిన బీజేవైఎం నాయకులు భానుప్రకాశ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గురువారం వారిని ములాఖాత్‌లో పరామర్శించేందుకు బండి సంజయ్ జైలుకు వచ్చారు. పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. లీకేజీలతో బీజేపీకి సంబంధం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.