Gun Park tension: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘‘ఛలో టీఎస్పీఎస్సీ’’ పిలుపు మేరకు గన్‌పార్క్ అట్టుడికింది. సంజయ్ దీక్షలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. పేపర్ లీకేజీపై వాస్తవాలు తెలుసుకునేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి బండి సంజయ్ వెళుతున్నట్లు ప్రకటించడంతో గన్ పార్క్ ను పోలీసులు చుట్టుముట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే పోలీసులు మైక్ కట్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు వెళ్లకుండా బండి సంజయ్, ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ కు రక్షణగా కార్యకర్తలు, మహిళలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో గన్ పార్క్ వద్దతీవ్ర ఉద్రిక్తంగా మారింది. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వాస్తవం, గూడుపుఠాణి జరిగిన మాట నిజం, దీనిపై స్పందించాల్సిన సీఎం నోరు మెదపడం లేదంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
Read also: Rohit Sharma Dance: బావమరిది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో వైరల్
పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేపీ అనేక రూపాల్లో ఉద్యమిస్తోందని పేర్కొన్నారు. ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తల ఇండ్లల్లో చొరబడి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మా బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసుల అనుమతి తీసుకోని గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించాలా? అంటూ ప్రశ్నించారు. ధరణి పోర్టల్ అక్రమాల్లోనూ నీ కొడుకు హస్తం ఉందని ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే దొంగ సారా దందా చేసిన లిక్కర్ క్వీన్ ను కాపాడుకునేందుకు కెబినెట్ అంతా ఢిల్లీ వెళతారా? మంత్రులకు సిగ్గు లేదా? నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే మీకు ముఖ్యమా? అంటూ బండి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో నీళ్లు-నిధులు-నియామకాల్లోనూ అక్రమాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: RC 15: సిఈవో వస్తున్నాడు… ఆ సినిమా డబ్బులన్నీ జనసేనకే?
బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా?దగుల్బాజీ రాజకీయాలు చేయడానికి సిగ్గుండాలే అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఏ ఆశయం కోసం తెలంగాణ సాధించుకున్నామో అందుకు భిన్నంగా పాలన సాగుతోందని ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్. టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమే… దీనికి బాధ్యతగా కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన కేసీఆర్ 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధాన కారకుడైన కేటీఆర్ ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు? అంటూ మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సిట్ విచారణ ఓ ఫార్స్… కేసీఆర్ సిట్ అంటే సిట్… స్టాండ్ అంటే స్టాండ్ అనడమే సిట్ పని అని అన్నారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని డిమాండ్ చేశారు.
Read also: IND VS AUS: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా
నిరుద్యోగులు ఏళ్ల తరబడి సరైన తిండిలేక, వసతి లేక కోచింగ్ తీసుకుంటుంటే వాళ్ల జీవితాలను చిద్రం చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపంచారు. టీఎస్సీఎస్సీ ఛైర్మన్ ఎవరిని నమ్మి మోసపోయారో స్పష్టం చేయాలన్నారు. టీఎస్సీస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని , మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసి అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. అరెస్టుల విషయంలో కేటీఆర్ కో న్యాయం? సామాన్యులకో న్యాయమా? అంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ యువత, కార్మికులు, ఉద్యోగులందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. మీరంతా బయటకు రండి… పోరాడండి… అంటూ పిలుపునిచ్చారు బండి సంజయ్.ఇప్పుడు భయపడి బైటకు రాకుంటే తీరని నష్టం తప్పదని అన్నారు.
Read also: Top Headlines@1pm : టాప్ న్యూస్
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ చెంప చెళ్లుమన్పించిన ఉపాధ్యాయులాందరికీ నా సెల్యూట్ అన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి ఓడించాలని చూసిన బీఆర్ఎస్ ను ఓటనే ఆయుధంతో చెంప చెళ్లుమన్పించారన్నారు. తెలంగాణ యువత పక్షాన ఉద్యమిస్తున్న బీజేపీని అన్ని వర్గాలు మద్దతు పలకాలని పిలుపు నిచ్చారు. టీఎస్పీస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే తప్పేముంది?, టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళుతున్నా అన్నారు. పేపర్ లీకేజీ అక్రమాలపై వాస్తవాలు తెలుసుకుంటా అన్నారు. బీజేపీ కార్యకర్తలంతా టీఎస్పీఎస్సీకి తరలిరండి అని బండి సంజయ్ పిలుపుతో అక్కడకు చేరుకున్న పోలీసులు బండిసంజయ్, ఈటల రాజేందర్ ను అడ్డుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది.
Pawan Kalyan : అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది