ఏపీలో మళ్ళీ ముందస్తు ముచ్చట నడుస్తోంది. ఒకవైపు జగన్ తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారంటూ ఊహాగానాలు వార్తలుగా వస్తున్నాయి. అయితే ఇదంతా మీడియా తన రేటింగ్స్ పెంచుకోవడానికే చేస్తున్న హంగామా అని మాజీ మంత్రి పేర్నినాని కొట్టిపారేశారు. తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తనదైన రీతిలో స్పందించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్. ప్రజలు ఆశీర్వదించినట్టుగా ఐదేళ్లు పాలన కొనసాగుతుందని ఎంపీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Son In Law Protest: అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన
రేపు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరగనున్న సమీక్ష సమావేశానికి రాజమండ్రి అసెంబ్లీ ఇన్ ఛార్జీగా వెళ్లతానని చెప్పారు. భరత్ రాజమండ్రిలో ఏన్టీవితో మాట్లాడుతూ మంత్రి వర్గం మార్పు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఉంటుందని అన్నారు. మరో ఐదేళ్లు ప్రజలను ఆశీర్వదించాలని కోరుతూ జగన్ సూచనలు మేరకు పనితీరు మెరుగుపర్చుకోవడానికి మంచి వేదిక అవుతుందని పేర్కొన్నారు. నవరత్నాలు అందరికి అందించడానికి ప్రయత్నిస్తామన్నారు.సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్లీ గెలెపిస్తాయనే ఆశాభవంతో ముందుకు వెళతామని అంటున్నారు ఎంపీ మార్గాని భరత్.
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 60 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చంద్రబాబు చెప్పారు.మొన్న 40 మంది, ఇప్పుడు 20 మంది ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటే 175 స్ధానాలలో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయాలి. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడుకు లేదు. ముందస్తు ఎన్నికలకు రావాల్సిన అవసరం మాకు ఏముంది? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. రాజకీయంగా ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దత్తపుత్రుడు వారాహి వాహనం ఉందా ఆమ్మేశాడా? రాబోయే ఎన్నికల్లో జగన్ 175 స్ధానాలు గెలిచి చంద్రబాబునీ, దత్తపుత్రుడు ను హైద్రాబాద్ పంపిస్తాం అన్నారు.
Read Also: Samantha: చైతన్యతో విడాకులు.. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నా