Locket Chatterjee: పశ్చిమ బెంగాల్ బీజేపీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనను ఖండించిన ఛటర్జీ.. మణిపూర్‌లో ఏర్పడిన పరిస్థితి పశ్చిమ బెంగాల్‌లో కూడా ఉందని అన్నారు. లాకెట్ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు, ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. జులై 8న జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మహిళా అభ్యర్థిని కూడా వివస్త్రను చేసి, ఆమె పట్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అమానవీయంగా వ్యవహరించారని ఆమె చెప్పారు. ఇదో మణిపుర్ తరహా ఘటన అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read: Karnataka: సీఎంపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్.. జులై 28న విచారణ
పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కూడా మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో జరిగిన నేరాలు బెంగాల్‌లో కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు. “మణిపూర్ సంఘటనను మేము ఖండిస్తున్నాము. ఇది విచారకరమైన సంఘటన. కానీ పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ పంచ్లాలో మహిళా బీజేపీ కార్యకర్తను నగ్నంగా ఊరేగించారు, ఇది మణిపూర్ సంఘటన కంటే తక్కువ విచారకరం?. రెండింటి మధ్య వ్యత్యాసం ఒక్కటే.. మణిపుర్ ఘటనలో వీడియో ఆధారం ఉంది. పశ్చిమ బెంగాల్ ఘటనలో వీడియో ఆధారం లేదు’’ అని సుకాంత మజుందార్ శుక్రవారం అన్నారు.
#WATCH | BJP MP Locket Chatterjee breaks down as she recounts an alleged incident of sexual assault by TMC workers of a BJP candidate during Panchayat polls on 8th July in Howrah district of West Bengal pic.twitter.com/45VdDGqDXi
— ANI (@ANI) July 21, 2023