రాహుల్ గాంధీపై బీజేపీ కుట్రపూరితంగా వేసిన కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం.. ప్రజల కోసం పని చేస్తున్న మనిషి రాహుల్ గాంధీ.. ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అని ఆయన తెలిపారు. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీని దెబ్బ తీయడానికి పరువు నష్టం కేసు వేసి ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఎంపీగా అనర్హుడిగా ప్రకటించి 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూండా దూరంగా ఉంచాలని బీజేపీ కుట్ర చేసిందన్నారు.
Read Also: Honey Rose : స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
కానీ చివరకు న్యాయం గెలిచింది.. సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ప్రజలకు న్యాయం జరిగింది అని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. బీజేపీ కుట్రలకు అడ్డు పడింది. రాహుల్ గాంధీ ప్రజల మధ్య పాదయాత్ర చేయడం వల్లే.. కర్ణాటకలో గెలిచాము.. తెలంగాణలో కూడా తప్పకుండా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ మంచి ప్రచార వ్యూహంతో ముందుకు దూసుకుపోతుందని ఠాక్రే అన్నారు.
Read Also: Drank Too Much Water: ఒక్కరోజులో తాగాల్సింది.. ఒకేసారి తాగింది.. ఆ తర్వాత గుండె ఆగింది
అయితే, ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంతో రాష్ట్ర రాజకీయాలను మార్చేసింది అని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. మంచి ప్రచార వ్యూహంతో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తే పక్కా గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్లిద్దరూ లోపాయికరిగా కలిసి పని చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో అక్కడి సమస్యలపై పోరాడాలి అని ఠాక్రే అన్నారు. అవినీతి, లిక్కర్ దండాలు బీఆర్ఎస్ నేతలు చాలా చేశారు.. అవన్నీ బయటపెట్టి జనానికి తెలియజేసి ఎన్నికలో ప్రభావం చూపేలా చెయ్యాలి అని మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు.
Read Also: Sruthi Shanmuga Priya: పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.. లైకుల కోసం మమ్మల్ని వేధించకండి!
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు గట్టిగా పనిచేయాలి.. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ చేశారు. వాటిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలి అని మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలు కోసం తీసుకోబోతున్న అన్ని రకాల హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి.. పెద్ద ఎత్తున పోస్టర్లు, ప్రచార సామగ్రితో ఇప్పటి నుంచే ప్రచారం నిర్వహించాలి అని ఆయన పేర్కొన్నారు.