కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా లోక్ సభలో బీఆర్ఎస్ మాట్లాడుతుందని అని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని బీఆర్ఎస్ కూడా ఇచ్చింది.. కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు చెప్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణకు న్యాయ పరంగా రావాల్సిన ఒక్క రూపాయి కూడా కేంద్ర సర్కార్ నుంచి రాలేదు అని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మాది ప్రజల కూటమి.. మాది పేదల కూటమి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నామన్నారు.
Read Also: Pushpa 2 : వైరల్ అవుతున్న ఫాహద్ ఫాసిల్ లుక్..
ఇవాళ( మంగళవారం ) పార్లమెంట్ చర్చలో మా సక్సెస్.. కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ పై మాట్లాడుతామని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సర్కార్ ప్రవర్తిస్తున్న తీరుపై పార్లమెంట్ సాక్షిగానే నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల పట్ల మోడీ సర్కార్ వ్యవసారిస్తున్న విధానంపై ప్రశ్నిస్తామని నామా అన్నారు.
Read Also: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రాహుల్ గాంధీ ప్రసంగం ఉత్కంఠ
అయితే, నేడు పార్లమెంట్ లో మోడీ సర్కార్ పై విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దానిపై కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ చర్చ ప్రారంభిస్తాడని ఆ పార్టీ నేతలు తెలియజేశారు. ఇక, అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన చర్చలో తాము పాల్గొంటామని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తొసిపుచ్చాడని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. చూడాలి.. అవిశ్వాస తీర్మానం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది వేచి చూడాలి.