కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు హాజరు అయ్యాడు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పుకొచ్చాడు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎల్లారెడ్డిలో అత్యదికంగా 1లక్షా 3 వేల మందికి రైతు బంధు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Perni Nani: పవన్ పార్టీ పోటీచేసేది ఆ సీట్లలోనే.. ఆ సంఖ్య మాత్రం దాటదు..
గతంలో కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు ఓటేస్తే రైతులకు ఏం చేశారు అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇచ్చారా.. కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగు నీరు కోసం రైతులు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆయన అన్నారు. విత్తనాలు ఎరువులు పోలీస్ స్టేషన్ లో పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Anil Sunkara: చిరంజీవితో మరో సినిమా చేసి సమాధానం చెప్తా..లీకైన అనిల్ సుంకర వాట్సాప్ చాట్?
కాంగ్రెస్ పార్టీవి నీతి లేని మాటలు.. హిందూ ముస్లిం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాబందులు రావాలా.. రైతు బంధు కావాలా.. మీరు నిర్ణయించుకోండి అంటూ కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కుంభకోణాలే జరుగుతాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షం.. మా పాలనలో సస్యశ్యామలం అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.