ఏపీలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గబాటి పురంధరేశ్వరి వర్సెస్ వైసీపీ పార్టీ నేతల మధ్య పెరుగుతున్న డైలాగ్ వార్ నడుస్తుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని పురంధరేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా!? అని ప్రశ్నించారు.
INDIA bloc: 2024 లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి కూటమిలోని పార్టీలన్నీ మూడు సమావేశాలను నిర్వహించాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇండియా కూటమిలోని పలువురు మిత్రపక్షాల నేతలు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించలేదని సమాజ్ వాదీ పార్టీ(చీఫ్) అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.
Congress to Retain Chhattisgarh Says Peoples Pulse Survey: తెలంగాణతో పాటు ఛత్తీస్‌ఘడ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికలకు సంబందించిన షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గత నెలలోనే విడుదల చేసింది. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌ఘడ్‌లో పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మరో ఐదు రోజుల్లో ఛత్తీస్‌ఘడ్‌లోని ఇరవై స్థానాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి…
Kishan Reddy: కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు లక్షల కోట్లు అప్పు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంధకార భవిష్యత్తుగా మారిందని వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్లో కొనసాగుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలి.. విజయసాయి రెడ్డే కాదు.. వైఎస్ జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు అంటూ ఆమె సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన' కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కమీషన్లు, ఆగమాగం పనులు చేయడంతోనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ విభాగాన్ని, ఇంజనీరింగ్ అధికారులను పని చేసుకోనివ్వకుండా తానే ఇంజనీర్ అని కేసీఆర్ అహంభావం ప్రదర్శించినందుకు.. కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరి నీళ్ల పాలైందని ఆరోపించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలొస్తే ప్రతిసారి గందరగోళం ఉంటుందన్నారు. ఇంకా మనలో పరిణితి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ఏ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో పరిణతి ఉందో ఆ దేశాలు ముందుకు పోతున్నాయని అన్నారు. ఓటు మనకు వజ్రాయుధం లాంటిది.. అదే మన తలరాతను మారుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరేం చేసారన్నది ఆలోచించి ఓటు వేస్తే మంచిదని చెప్పారు.…
Ayodhya Ram Mandir: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి. మరోసారి అధికారం సాధించాలని బీజేపీ, గద్దె దించాలని కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్, మాజీ సీఎం కమల్‌నాథ్ రామమందిరంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి.
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి ఫెవర్‌గా వ్యవహరిస్తుంటారు. గతంలో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు కంగనా ఏదో రోజు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.