Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. త్వరలో నామినేషన్లు వేయనున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.
PM Modi: ఈ నెలలో ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక గిరిజన వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధాని ఆరోపించారు.
Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడవు ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల్ని పాత కేసులు వెంటాడుతున్నాయి. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల టీచర్ల రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది.
Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలంతా కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఈ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి సీట్లు కేటాయించపోవడంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గుర్రుగా ఉన్నారు.
Harish Rao: కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా అంటూ మైనంపల్లి పై మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..
Kunamneni: ఇప్పుడిప్పుడు మాట మారిస్తే మాత్రం సరైంది కాదు.. కాంగ్రెస్ తో పొత్తు ఇవాళ ,రేపు ఫైనల్ అవుతుందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనoనేని సాంబశివరావు అన్నారు.
Raja Singh: ఓబీసీ నేత నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదే అని బీజేపీ శాసనసభ్యులు రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. బీసీ ద్రోహుల పార్టీలు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
K.Laxman: బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తోందని కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాహుల్ తెలంగాణ ఎన్నికల ప్రచారం లో బీజేపీ, బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు.
ఏపీలో సీఎం వైఎస్ జగన్ అస్మదీయుల విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులలో రివర్స్ టెండ"రింగ్" జరిగింది.. జల, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు అక్రమాల పైన ప్రశ్నించి 7 నెలలు పైగా గడచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన చలనం లేదన్నారు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.