Purandeswari: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. కోడుమూరు పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుభరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా వైఎస్ జగన్ ప్రచారం చేసుకుంటున్నారు అని దుయ్యబట్టారు.. సిల్వర్ జూబ్లీ, ట్రిపుల్ ఐటీ కళాశాలలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే .. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. ఇక, శ్రీశైలం డ్యాం మరమ్మత్తులకు కేంద్రం విడుదల చేసిన 720 కోట్ల రూపాయలలో ఎంతమేర పనులు చేశారో చెప్పాలి..? అంటూ సవాల్ చేశారు. జిల్లాలో వలసల నివారణలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. వలస నివారణకు ఉపాధి హామీ నిధులను సీఎం వైఎస్ జగన్ పక్కదారి పట్టించడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఇక, ఎన్నికలపుడు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర స్ధిరీకరణ కోసం ఫండ్ ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చ్చారు.. కానీ, జగన్ తర్వాత మాటతప్పడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా కేంద్రం ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులు జగన్ జేబులోకి వెళ్తున్నాయి.. జిల్లాలో సాగు, తాగు, నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ వివమర్లు గుప్పించారు దగ్గుబాటి పురంధేశ్వరి..
Read Also: Tiger Nageswara Rao : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ లోకి రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు..