పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ భయ పెట్టాలని చూస్తున్నారు అని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఐటీ దాడులకు భయపడేది లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. ఇది బీఆర్ఎస్- బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర.. ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడరు అంటూ టీపీసీసీ చీప్ మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అంత అండగా ఉంటుంది అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Mrunal Thakur: స్లీవ్ లెస్ డ్రెస్ తో సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న..మృణాల్ ఠాకూర్
ఓటమి భయంతోనే బీఆర్ఎస్- బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకులను మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఐటీ అధికారులు దాడులు చేస్తుందని దుయ్యబట్టారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది అని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అని వెల్లడించారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.