Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పెద్ద ప్రకటన చేశారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ప్రస్తావిస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన మా మధ్య లేకపోవడం ఇదే తొలిసారి అని అన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్ధి ముత్యల సునిల్ రెడ్డి తరుఫున ఆమే ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఒక సైడ్ బీఆర్ఎస్ అవినీతి విజృంభిస్తుంది.. రెండో సైడ్ లో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కేసీఆర్ కి, ఆ పార్టీకి ప్రస్టేషన్ మొదలైంది.. ఓడిపోతున్నాం అని ఏదేదో మాట్లాడుతున్నారని…
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపు కొరకు హుడా ట్రక్ పార్క్లో రేపు జరగబోయే విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి వెల్లడించారు.
PM Modi security breach: పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన గతేడాది చర్చనీయాంశంగా మారింది. అత్యంత రక్షణ ఉండే ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్పై ఆందోళనకారులు నిలిపేశారు. పంజాబ్ పోలీస్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భద్రతా ఉల్లంఘన జరిగనట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జనవరి 5, 2022 రోజున పంజాబ్ లోని ఫిరోజ్పూర్ పర్యటనకు మోడీ వెళ్లిన క్రమంలో, రైతులు ప్రధాని కాన్వాయ్ని అడ్డుకున్నారు.
Rahul Gandhi Comments: సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంపూర్ణ కల సహకారం కాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది. మీ కలలు కూడా సహకారం చేసింది మేమే. కంప్యూటర్ నమోదు పేరుతో భూములన్ని ధరణిలో నమోదు చేస్తూనే.. 24 గంటలు భూములను ఎలా లాక్కోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని…
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తుక్కుగూడలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో తెలంగాణ చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి డ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభం అయిందే కాంగ్రెస్ నుండే అని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు…
కేసీఆర్ తెలంగాణను రాజకీయాల కోసం వాడుకొని దగా చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ధరణి పేరుతో దొరికిందల్లా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ భూ బకాసుర పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా వద్దా.. 2024లో మోదీని మరోసారి ప్రధాని కావాలా వద్దా అని అన్నారు. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుందని ఆరోపించారు. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన…
అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వేములవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని, దానికి మీరంత రావాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం ఉమ్మడి కరీంనగర్ రాజన్న సిరిసిల్లాలో బీజేపీ అభ్యర్థి వికాస్ రావు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు యోగి ఆదిత్య బహిరంగ సభలో ప్రసంగించారు. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్తో జతకట్టి ప్రజలను మోసం…