మరికొద్ది సేపట్లో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ మొదలు కానుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుందని ఈసీ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బూత్‌ల దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35, 655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం రెడీ చేసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఇప్పటికే పట్టణాలు, నగరాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్లారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూండా రాష్ట్ర పోలీసులతో పాటుపారామిలటరీ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు..
మంచిర్యాల జిల్లా బీమారం పోలింగ్ బూత్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని వాహనం బూత్ లోపలికి వెళ్లిందని కాంగ్రెస్ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. బాల్క సుమన్ అనుచరులు నలుగురు నెంబర్ ప్లేట్ లేని కారులో బూత్ లోపలికి వెళ్లినట్టు చెబుతున్నారు. బీమారం SI రాజవర్ధన్ వారికి సహకరించారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆందోళనకు దిగిన కార్యకర్తల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకట స్వామి సమాచారం అడిగి తెలుకున్నారు.
బీమారంలోని పోలింగ్ బూత్ వద్ద ఎక్కడా కూడా సెంట్రల్ ఫోర్స్ లేదని స్టేట్ పోలీస్ తో సెక్యూరిటీ కలిపించారని ఆరోపించారు. 136 బూత్ లో తమకు అన్యాయం జరిగిందని తెలిపారు.
వికారాబాద్ జిల్లా పరిగి కులకచర్ల మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఇంకా ఓటింగ్ కొనసాగుతుంది. వందకు పైగా ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు.
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో 80.34 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలలో మొత్తం నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 249554 ఉంది. అందులో పురుషులు ఓట్లు 121744, పురుషులు ఓట్లు వేసిన వారి సంఖ్య 97961.. మహిళలు మొత్తం ఓట్లు 127792, మహిళలు ఓట్లు వేసిన వారి సంఖ్య 102525.. మొత్తం ఓట్లు 249554.
మొత్తం ఓట్లు వేసిన వారి సంఖ్య 200486గా ఉంది.
కొమరంభీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామం బూత్ నెం 156లో ఇంకా పోలింగ్ పూర్తి కాలేదు. ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా.. ఇంకా క్యూలైనలో వేచిచూస్తున్నారు. ఉదయం నుంచి ఈవీఎంలు నాలుగుసార్లు మోరాయించినట్లు ఓటర్లు చెబుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 15నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి చెదురు ముదురు సంఘటనలు జరగకుండా ఓటర్లు పూర్తిగా సహకరించారని.. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కృషి చేసిన మీడియా మిత్రులకు, పోలీస్, జీహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది, పోలింగ్ లో పాల్గొన్న పోలింగ్ అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలో చెదురుమదురు ఘటనల మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. యకత్ పురా ఎంఐఎం నేత యసేర్ అరఫత్, ఎంబీటీ నేత అంజదుల్లాహ్ ఖాన్ పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలో.. కాంగ్రెస్-ఎంఐఎం మధ్య జరిగిన గొడవకు సంబంధించి కూడా కేస్ నమోదు చేశామని.. బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఎంఐఎం కార్పొరేటర్ హుస్సేని పాషా పై కేస్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు బోగసింగ్ కు పాల్పడ్డ ముగ్గురు మహిళలపై కూడా కేస్ నమోదు చేసినట్లు దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 66.40% పోలింగ్ శాతం నమోదైంది. అందులో....
117 కొత్తగూడెం.. 64.73%
118 అశ్వారావుపేట 71.84%
119 భద్రాచలం.. 67.03%
110 పినపాక.. 65.02%
111 ఇల్లందు.. 65.19%
సిర్పూర్ 71.18
చెన్నూర్ 74.61
బెల్లంపల్లి 76.79
మంచిర్యాల 64.20
ఆసిఫాబాద్ 72.08
ఖానాపూర్ 72.60
ఆదిలాబాద్. 72.10
బోథ్ 75.30
నిర్మల్ .74.68
ముదోల్.67.20
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 64.05 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. తుది పోలింగ్ శాతం వివరాలు రావడానికి ఇంకా సమయం పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల ముగిశాయి. ఇవాళ పోలింగ్‌కు తెర పడింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా వచ్చేశాయి. అన్నింటిలో కాంగ్రెస్‌దే హవా అన్నట్టుగా ఉంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది. కేసీఆర్ అక్రమ సంపాదనతో ఎన్నికలను ప్రభావితం చేసి శాశ్వతంగా అధికారంలో కొనసాగుతానని అనుకున్నారు. కానీ తెలంగాణ సమాజం అవసరం అనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుంది. దీన్ని మరోసారి తెలంగాణ ప్రజలు నిరూపించారని రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు కష్ట పడ్డారు… కేసీఅర్‌ను ఇక్కడ ఓడగొట్టారు. శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ చూసి కేటీఆర్ వచ్చి భయపట్టే ప్రయత్నము చేశారు. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెబుతారా?’ అని రేవంత్ సవాలు విసిరారు.
బీఆర్ఎస్ పై గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత ద్వేషం ఉందో గజ్వేల్ లో తిరిగితే అర్థం అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేది వేరు చేసేది వేరు.. నియంత లాగా వ్యవహారం చేశారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించడానికి బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ జనం ఓటు వేశారని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం, యువత, మహిళలు మార్పు రావాలి.. ఆ మార్పు బీజేపీకి రావాలి అని కోరుకున్నారని ఈటల పేర్కొ్న్నారు. రాష్ట్రంలో బీజేపీకి 25 నుండి 30 సీట్లు వస్తాయి.. సంకీర్ణాల రాజకీయాల్లో ఏమవుతుందో చూడాలి.. బీఆర్ఎస్‌తో కలిసేది లేదని ఈటల రాజేందర్ తెలిపారు.
తెలంగాణ పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రేపు ఉదయానికి ఫైనల్ పోల్ పర్సంటేజ్ వస్తుంది.. మళ్లీ అధికారం మాదే.. హ్యాట్రిక్ కొడతాం.. 70కి పైగా సీట్లు గెలుస్తామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్.. ఈ తరహా ఎగ్జిట్‌పోల్స్ గతంలోనూ చూశాం.. మాకు కొత్త కాదు.. ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదు.. ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే.. ఎగ్జిట్ పోల్స్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ తప్పయితే డిసెంబర్ 3 తర్వాత క్షమాపణలు చెప్తారా? అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
మలక్ పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ పై ఎంఐఎం నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో పొలింగ్ సమయం పూర్తి కావడంతో పరుగెత్తుకుని వచ్చిన ఫలితం దక్కలేదు. సమయం అయిపోయిందని తిరిగి పంపించారు ఎన్నికల అధికారులు. దీంతో ఓటర్లు నిరాశతో వెనుతిరిగారు.
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. అయినా క్యూలైన్ లో భారీగా ఓటర్లు పోటెత్తారు. మరోవైపు పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీంతో.. ఓటర్లు అసహనం చెందుతున్నారు. మరోవైపు అధికారులు పోలింగ్ కేంద్రాల గేట్ లకు తాళాలు వేసి బయట వారు ఎవరు లోపలికి రాకుండా చూస్తున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటర్లు బారులు తీరారు. నర్సాపూర్ ప్రభుత్వ స్కూల్ లో ఓటేసేందుకు వందలాది మంది ఓటర్లు లైన్ లో నిల్చున్నారు. ఈ క్రమంలో.. క్యూ లైన్ లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా.. బయటి నుంచి లోపలికి ఎవరు రాకుండా పోలీసులు గేట్లు మూసేశారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతినగర్ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు వోటర్ స్లిప్స్ టేబుల్ పై పార్టీ కండువా, పార్టీ కరపత్రాలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరుగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు పార్టీల వారిని బాచుపల్లి పోలీసులు శాంతింపజేశారు.
తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. చెదురు ముదురు గటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మరోవైపు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రంలో భారీ క్యూలైన్లు ఉంటే.. టోకెన్లు జారీ చేసి ఓటు వినియోగించుకునే అవకాశం ఇవ్వనున్నారు ఎన్నికల కమిషన్.
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళబోతున్న రేగా కాంతారావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ముందస్తుగా పోలింగ్ కేంద్రం సమీప గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో రేగా కాంతారావుగేట్లు నెట్టుకొని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిపోయారు. అంతేకాకుండా.. గేట్లు నెట్టుకొని రాబోయే ఓటర్ల పై పోలీసులు లాఠీచార్జీ చేేశారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో 102 ఏళ్ల కస్తూరమ్మ అనే వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటునట్లు ఆ వృద్ధురాలు తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఎనిమిదో వార్డు బ్రాహ్మణపల్లి పోలింగ్ బూత్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఓ ఓటరు ఓటు వేసే విషయంలో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు ఆ ఘర్షణను అడ్డుకున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి గవర్నమెంట్ స్కూల్ లో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పోలింగ్ కేంద్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ తలెత్తడంతో పోలీసులు లాఠీ ఝలిపించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామం 121 పీఎస్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అక్కడ వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రోడ్ నెంబర్ 14లోని పోలింగ్ బూత్ నెంబర్ 140లో కుటుంబ సమేతంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎంపీపట్ గూడలోని 131 బూత్ లో ఈవీఎంలు మోరాయించాయి. దీంతో ఓటర్లు భారీగా బారులు తీరారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ (మం) మునిదేవునిపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. 1157 మందికి ఒకే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడంతో గంటల తరబడి లైన్లోనే నిల్చున్నారు ఓటర్లు. దీంతో ఎన్నికల అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం చేసి... సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో.. అదేవిధంగా కొత్తగూడం నియోజకవర్గంలోని ఎల్జిరెడ్డిపల్లి పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే రేగా కాంతారావుని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక మహిళను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నెట్టివేయటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రేగా కాంతారావు చెప్పుతీయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగులో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. బీఆర్ఎస్ నేతలు పోలింగ్ బూత్ ని కాప్చర్ చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సర్వరాం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ తండాలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. తమకు డబ్బులు రాలేదని గ్రామస్తులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా పోలింగ్ బూత్ కు ప్రజలు పోటెత్తారు. దీంతో గ్రామస్తులపై డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ లాఠీచార్జి చేశారు.
సనత్ నగర్ నియోజకవర్గంలోని ఇస్లామియా హైస్కూల్ బూతు నెంబర్ 68లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా రావడం లేదని అన్నారు. ఈసారి కూడా పోలింగ్ శాతం 55 నుంచి 60 శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు. నగరంలో మొత్తం ఎమ్మెల్యే స్థానాలు గెలిచి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పడుతుందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
మంథని నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 71.24 శాతం ఓటింగ్ నమోదైంది. మెజారిటీ బూత్ ల వద్ద ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారు. 4 గంటల లోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు అంటున్నారు.
మలక్ పేట నియోజకవర్గం సలీం నగర్ లోని జీ హెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్ పోలింగ్ స్టేషన్ లో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్ మారేడుపల్లిలోని కస్తూరీబా కాలేజీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
ముషీరాబాద్ లో 27.98%..
మలక్ పేట్ లో 29.16%..
అంబర్ పేట్ లో 34.3 %..
ఖైరతాబాద్ లో 37%..
జూబ్లీ హిల్స్ లో 35.3 %..
సనత్ నగర్ లో 39.27%..
నాంపల్లిలో 22.7%..
కర్వాన్ లో 32.4%..
గోషామహల్ లో 35 %..
చార్మినార్ లో 29.83%..
చాంద్రాయణగుట్టలో 24.6%..
యాకుత్ పురాలో 20.09%..
బహదూర్ పురాలో 30.41%..
సికింద్రాబాద్ లో 36.31%..
కంటోన్మెంట్ లో 37.81% పోలింగ్ నమోదు..
పలు నియోజకవర్గాల్లో పోలింగ్ గంట ముందే ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లందు, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇదిలా ఉంటే... సాయంత్రం 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ సాయిపూర్ లోని పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి.. చాలాసేపు పోలింగ్ కేంద్రంలో ఉండడంతో కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. అంతేకాకుండా.. రోహిత్ రెడ్డి రిగ్గింగ్ పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో పోలింగ్ కేంద్రం బయట కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేపట్టారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులపై డీఎస్పీ శేఖర్ గౌడ్ లాఠీలు ఝులిపించారు. బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండల కేంద్రంలో గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పోలింగ్ బూత్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని బెదిరింపులకు దిగినా.. గజ్వేల్ ప్రజలు సైలెంట్ గా ఓటు వేస్తున్నారని తెలిపారు. సీఎం మీద ఎంత కోపం ఉందో ఓటు రూపంలో చెప్పారని పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీన అది బయటపడుతుందని అన్నారు. గజ్వేల్ రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ.. ఈ నిరంకుశ్షత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని ఈటల చెప్పారు.
మెదక్ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో.. మైనంపల్లి, పద్మా దేవేందర్ రెడ్డి వర్గీయులు ఘర్షణకి దిగారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఘర్షణను చెదరగొట్టి ఇరువర్గాలను అదుపులో తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో దొంగ ఓటు వేసేందుకు ఓ పార్టీకి చెందిన కార్యకర్త యత్నించాడు. రామచంద్రాపురం మల్లికార్జున నగర్ ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో బూత్ నెంబర్ 337, 338లో దొంగ ఓటేసేందుకు వెళ్లాడు. గమనించిన ఇతర పార్టీల నేతలు నిలదీశారు. దొంగ ఓటు వేసేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ 69.33 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ 31.17 శాతం పోలింగ్ నమోదైంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే..
ఆదిలాబాద్ 62.34శాతం...
భద్రాద్రి 58.38 శాతం...
హనుమకొండ 49 శాతం...
హైదరాబాద్ 31.17 శాతం...
జగిత్యాల 58.64 శాతం...
జనగాం 62.24 శాతం...
భూపాలపల్లి 64.30శాతం...
గద్వాల్ 64.45 శాతం...
కామరెడ్డి 59.06 శాతం...
కరీంనగర్ 56.04 శాతం...
ఖమ్మం 63.62 శాతం...
ఆసిఫాబాద్ 59.62 శాతం...
మహబూబాబాద్ 65.05 శాతం...
మహబూబ్ నగర్ 58.89 శాతం...
మంచిర్యాల 59.16 శాతం...
మెదక్ 69.33 శాతం...
మేడ్చల్ 38.27శాతం...
ములుగు 67.84శాతం...
నాగర్ కర్నూల్ 57.52 శాతం...
నల్గొండ 59.98 శాతం...
నారాయణపేట 57.17 శాతం...
నిర్మల్ 60.38 శాతం...
నిజామాబాద్ 56.50 శాతం...
పెద్దపల్లి 59.23శాతం...
సిరిసిల్ల 66.66శాతం...
రంగారెడ్డి 42.43శాతం...
సంగారెడ్డి56.23 శాతం...
సిద్దిపేట 64.91 శాతం...
సూర్యాపేట 62.07 శాతం...
వికారాబాద్ 57.62 శాతం...
వనపర్తి 60.10 శాతం...
వరంగల్ 52.28 శాతం...
యాదాద్రి 64.08శాతం పోలింగ్ నమోదు అయింది.
సాయంత్రం 4.50 గంటలకు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకంట్ల కవిత.
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. అందులో భాగంగా.. రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ క్లబ్ లో మెగాపవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓల్డ్ సిటీ పోలింగ్ పై హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ప్రత్యేక నజర్ పెట్టారు. ప్రత్యేకంగా యాకత్ పురా పోలింగ్ పై సీరియస్ అయ్యారు. ఒక్కసారిగా పోలింగ్ బూత్ లో జనాలు గుమిగూడటంతో PO పై సీరియస్ అయ్యారు. విధులు నిర్వహిస్తారా లేక వేరే అధికారులను మార్పు చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి నియోజకవర్గంపై కూడా ప్రత్యేక నిఘా పెంచారు.
నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 56.50 శాతం నమోదైంది.
ఆర్మూర్. 52.26
బోధన్. 58.75
బాన్సువాడ . 62.15
నిజామాబాద్ అర్బన్. 46.11
నిజామాబాద్ రూరల్. 60.83
బాల్కొండ. 62.21
సంగారెడ్డి జిల్లా
1. సంగారెడ్డిలో 61.13 శాతం పోలింగ్ నమోదు
2. పటాన్ చెరులో 48.32 శాతం పోలింగ్ నమోదు
3. ఆందోల్ లో 58.23 శాతం పోలింగ్ నమోదు
4. నారాయణఖేడ్ లో 52.02 శాతం పోలింగ్ నమోదు
5. జహీరాబాద్ లో 57.66 శాతం పోలింగ్ నమోదు
మెదక్ జిల్లా
1. మెదక్ లో 70 శాతం పోలింగ్ నమోదు
2. నర్సాపూర్ లో 70 శాతం పోలింగ్ నమోదు
సిద్దిపేట జిల్లా
1. దుబ్బాకలో 70.48 శాతం పోలింగ్ నమోదు
2. సిద్దిపేటలో 64.52 శాతం పోలింగ్ నమోదు
3. గజ్వేల్ లో 62.35 శాతం పోలింగ్ నమోదు
భువనగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 3 గంటల వరకు 61.00 శాతం నమోదైంది. నల్గొండ జిల్లాలో సాయంత్రం 3గంటల వరకు 59.98 శాతం పోలింగ్ నమోదైంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మధుమాలాంచ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్ లో దొంగ ఓట్ల కలకలం రేపింది. పోలింగ్ ఏజెంట్లు నిలదీయడంతో ఓ యువకుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. ముస్లిం మహిళలు బుర్కలు తీయకపోవడంతో ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగంలోని జిల్లా ప్రాథమిక పాఠశాలలోని 59 బూత్ లో ఈవీఎం మొరాయిస్తుంది. దీంతో 40 నిమిషాల నుండి ఓటర్లు క్యూలైన్ లోనే పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఓపిక లేని వృద్ధులను వరండాపై కూర్చోపెట్టారు అధికారులు.
నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం కొనసాగుతుంది. పరస్పరం వాహనాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. శివ్వంపేట (మం) భీమ్లా తండాలో కాంగ్రెస్ కార్యకర్త కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త సుధీర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణలు చేశారు. కాసేపటి క్రితమే నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కుమారుడి కారుపై కొంత మంది వ్యక్తులు దాడి చేశారు.
నిర్మల్ జిల్లా తానూరు మండలం మహలిoగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం వేరే చోట నివాసం వుండగా అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన సొంత గ్రామానికి ఆవుపై వచ్చాడు ఓ ఓటరు. ఓటు హక్కును వినియోగించుకున్నని తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.