తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండో రౌండ్ ఫలితాలు వెలువడయ్యాయి. రెండో రౌడ్‌లో గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు 2800 ఓట్ల ఆధిక్యం ఉంది. మధిరలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 4,137 ఓట్ల ఆధిక్యంలో భట్టి విక్రమార్క ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థికి 145 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇబ్రహీంపట్నంలో రెండో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. ఆంధోల్‌లో 1731 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి.. సిద్దిపేటలో రెండో రౌండ్‌లో హరీష్‌రావుకు 4,313 ఓట్ల ఆధిక్యం ఉన్నారు. పాలేరులో రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 3181 ఓట్ల ఆధిక్యం ఉంది. మేడ్చల్, కూకట్‌పల్లిలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి 3,350 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు,. కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానందకు 3585 ఓట్ల అధిక్యం ఉండగా.. ఆర్మూర్‌లో బీజేపీకి 1,281 ఓట్ల ఆధిక్యం ఉంది.
Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ..
అటు.. ఖైరతాబాద్‌లో రెండో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు 95 ఓట్ల ఆధిక్యం ఉంది. జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 1006 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎల్బీ నగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి సుధీర్‌రెడ్డికి 513 ఓట్ల ఆధిక్యం, సిరిసిల్లలో రెండో రౌండ్‌లో కేటీఆర్‌కు 1759 ఓట్ల ఆధిక్యం, సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు 2716 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వేములవాడలో మూడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి 993 ఓట్ల ఆధిక్యం, యాఖుత్‌పురాలో బీజేపీకి 891 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సూర్యాపేటలో రెండో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డికి 385 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆందోల్‌లో రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 1724 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుస్నాబాద్‌లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 1506 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎల్బీ నగర్‌లో సుధీర్‌రెడ్డికి 1335 ఓట్ల ఆధిక్యం, స్టేషన్ ఘన్‌పూర్‌లో రెండో రౌండ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 483 ఓట్ల ఆధిక్యం, చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కంటోన్మెంట్‌లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 3406 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్, చార్మినార్, కార్వాన్, బహదూర్‌పురా, చంద్రాయణగుట్ట, మలక్‌పేట్‌లో ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థులు ఉన్నారు.