ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్నారు. అందులో భాగంగానే.. కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుండి విముక్తి కోరుతున్నారని తెలిపారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉన్నాయన్నారు. తాను ఇచ్చే మాటలే గ్యారంటీ అని అన్నారు. దేశానికి…
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రయాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లూరు పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో ఆమె ప్రసంగించారు. ‘ఇందిరగాంధీకి తెలంగాణ అంటే చాలా ఇష్టం. చనిపోయిన ఇన్నేళ్లకు కూడా ఇందీరా గాంధీ మీ అందరికి గుర్తున్నారంటే ఆమె చేసిన పాలనే. భూమి.. నీళూ.. నీధుల కోసం పోరాటం చేసి అభివృద్ధి చేశారు కాబట్టే మిరందరూ ఆమెను గుర్తుపెట్టుకున్నారు. నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి.. ఎదిరించాలి. కేసిఆర్ పది…
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా.. ఆదిలాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదు.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో 400 మండలాలకు పైగా కరువు విలయ తాండవం చేస్తుంటే.. కేవలం100 మండలాలు మాత్రమే కరువు ఉందని చెప్పడం మోసపూరితం అన్నారు. కరువు మీద వాతావరణ శాఖ హెచ్చరించినా.. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం రైతాంగం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కున్న అగౌరవ భావం, చిన్నచూపు కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.
తెలంగాణలో కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేస్తుంది.. కర్ణాటకలో 100 కోట్ల మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు.. నిన్ననే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని డీకే శివకుమార్ అన్నారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో నేడు పర్యటించబోతున్నారు. తాండూరులో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరపున ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో లేఖలు కనిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి.