Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలకు జరగగా.. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ ఇలా 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. రాష్ట్రంలోని మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది.. అయితే, ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్నవారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు.. ఇక, ఆయా నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి.. తమ గెలుపు, ఓటములపై అంచనాలు వేసుకుంటున్నారు ప్రాధాన పార్టీల అభ్యర్థులు.. ఇక, చిన్నా చితక పార్టీల అభ్యర్థులు.. మనకు ఎన్ని ఓట్లు రావొచ్చు అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Read Also: Israel-Hamas: కాల్పుల విరమణ గడువుకు కొన్ని నిమిషాల ముందు.. సంధి ఒప్పందం పొడగింపు..