Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం రాబోయే లోక్సభ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డులను ‘డీయాక్టివేట్’ చేసిందని, తద్వారా ప్రజలకు వచ్చే ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పొందకుండా చేశారని ఆదివారం ఆరోపించారు.
JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడగింపుపై బీజేపీ జాతీయ మండిలి ఆమోదం తెలిపింది. జూన్, 2024 వరకు ఆయన పదవినీ పొడగించారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు జేపీ నడ్డా నాయకత్వాన్ని బీజేపీ పెంచుతూ వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయానికి ఆదివారం పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదం లభించింది. అంతేకాకుండా పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని జేపీ నడ్డాకు…
Ayodhya Temple: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ వేదిక బీజేపీ జాతీయ సమావేశం జరుగుతోంది. భారతదేశంలో రాబోయే వెయ్యేళ్లకు రామరాజ్య స్థాపనకు ఇది నాంది పలుకుతూ, అయోధ్య రామ మందిరంపై ఆదివారం బీజేపీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ చైతన్యంగా దేవాలయం మారిందని తీర్మానం పేర్కొంది. ‘‘ పురాతన పవిత్ర నగరమైన అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో దివ్యవమైన ఆలయాన్ని నిర్మించడం దేశానికి ఒక చారిత్రక, అద్భుత విజయమని, ఇది భారతదేశంలో రాబోయే 1000 ఏళ్ల రామ…
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కర్ణాటక హోం మినిస్టర్ బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ముస్లిం సమాజానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎక్కువ ఇచ్చామని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఇది వివక్ష అంటూ విమర్శించారు.
PM Modi: లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రోజు న్యూఢిల్లీలో బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోడీ దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీయేకు 400పైగా సీట్లు రావాలంటే, బీజేపీ 370 సీట్లు గెలవాల్సి ఉందని ఆయన అన్నారు. తాను మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, దేశం కోసం పనిచేయాలని ప్రధాని మోడీ అన్నారు. నా ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు కట్టించే…
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్ఖలీ గత కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో మహిళలు, యువత టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తన నిరసన, ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి బీజేపీ పార్టీ నుంచి సపోర్టు లభిస్తోంది.
ప్రపంచంలోనే బీజేపీ (BJP) అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల అజెండాను నిర్దేశించేందుకు భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ సదస్సును ఢిల్లీలో ప్రారంభించింది.
Kamal Nath: గతేడాది చివర్లో జరిగి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అన్ని తానై నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బీజేపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. మరోవైపు ఆయన కుమారుడు చింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ ఇప్పటికే తన సోషల్ మీడియా బయో నుంచి కాంగ్రెస్ని తొలగించారు. ఈ నేపథ్యంలో చేరిక లాంఛనమే అని తెలుస్తోంది.
Arvind Kejriwal: ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ఆప్ అతిపెద్ద ముప్పుగా ఉందని, అందుకే తమ పార్టీపై, నేతలపై అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తాను అనేక దాడుల్ని ఎదుర్కొంటున్నానని, ఇప్పుడు తనను అరెస్ట్ చేయాలని బీజేపీ అనుకుంటుందని,…