Purandeswari: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో.. వైసీపీ సింగిల్‌గానే పోటీకి రెడీ అవుతుండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లే దిశగా చర్చలు సాగుతున్నాయి.. అయితే, పొత్తుల విషయం ఏ రకంగా ఉన్నా బీజేపీ కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నారు అని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేంద్రం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “ప్రజాపోరు యాత్ర” ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం అని ప్రకటించారు. మద్యపాన నిషేదం, రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేస్తాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లలను ఐదు క్లస్టర్ గా విభజించి బూత్ స్థాయి కార్యకర్తలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిశా నిర్దేశం చేస్తారని వివరించారు.. ఇక, అన్ని పార్లమెంట్, అసెంబ్లీలో బీజేపీలో పోటీ చేయడానికి సిద్దంగా ఉంది.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి.
Read Also: Joe Biden: పుతిన్‌పై బైడెన్ దూషణల పర్వం.. బూతు మాటతో స్పీచ్ స్టార్ట్..!
మరోవైపు.. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సీరియస్ కామెంట్లు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పని చేయాలన్నారు. ఓ రాజకీయ పార్టీకో.. పొలిటికల్ లీడర్లకు అధికారులు అనుకూలంగా ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులుగా ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలి కానీ.. పార్టీ పట్ల కాదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు పురందేశ్వరి. తప్పులు చేసే అధికారులు తీరు మార్చుకోకుంటే కేంద్రానికి ఫిర్యాదులు చేస్తామని, ఏపీలో దొంగ ఓట్ల అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే దొంగ ఓట్ల వ్యవహరం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, మా ఫిర్యాదుతోనే ఐఏఎస్ అధికారి గిరీషా సహా ఇతర అధికారులను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. వైసీపీ నేతలు – అధికారులు కుమ్మక్కై ఓటర్ల జాబితాలో అవకతవలు చేస్తున్నారని, క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాలో అవకతవకలు చేయగలరన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి.