Tamil Nadu: తమిళనాడులో బీజేపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. మధురైలో బీజేపీ ఓబీసీ విభాగం నేత గురువారం ఉదయం గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని శక్తివేల్‌గా గుర్తించారు. బీజేపీ ఓబీసీ విభాగం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఈయన గురువారం ఉదయం ఫైనాన్సింగ్ పనిలో నిమగ్రమై ఉండగా.. సాంగు నగర్‌లోని గోదాం వద్దకి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు చేసిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వీరిపై అక్కడి మహిళలు చీపుళ్లు, కర్రలతో ఎదురుతిరిగారు. దీంతో ఒక్కసారిగా ఈ చిన్న గ్రామం జాతీయ వార్తల్లో ప్రధానాంశంగా మారింది. మహిళలు, యువకులు చేస్తున్న ఈ ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మద్దతు ఇచ్చింది. బీజేపీ చీఫ్ మజుందార్, ఇతర నేతలు టీఎంసీ గుండాలను అరెస్ట్ చేయాలని…
BJP: లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో రాజ్యసభ సందడి నెలకొంది. పలువురు నాయకులు తమ పదవీ కాలం పూర్తి చేయడంతో వివిధ పార్టీల తమ అభ్యర్థులన్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి తొలిసారిగా లోక్‌సభను వీడి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి ఆమె 2024 ఎన్నికల్లో పోటీ చేయదని తెలుస్తోంది.
Renuka Chowdhury: బ్యారేజ్ లు కూలుతుంటే... డ్రామాలు చేస్తున్నారని, ప్రధాని రాజకీయాలు చెయ్యొచ్చు... దేశంలో ప్రజలకు అన్నం పెడుతున్న రైతులు ఉద్యమాలు చెయ్యవద్దా?
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపీ రాయ్ బరేలీ ఎంపీ బరిలో నిలవడం లేదు. తాజాగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్నికవ్వాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీలో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో ఈ పరిణామంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరిస్తోందని బీజేపీ బుధవారం పేర్కొంది. సోనియా గాంధీ జైపూర్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత బిజెపి ప్రతిస్పందన…
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి బలహీనపడుతున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా వెళ్లిపోవడం పార్టీని కలవరపెడుతోంది.