BJP Vijaya Sankalpa Yatra: రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే నేటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి…
రేపటి నుంచి తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. అందుకు సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలు రేపటి నుండి వచ్చే నెల 2 వరకు జరుగుతాయని తెలిపారు. మొత్తం 5 యాత్రలు ఉంటాయని అన్నారు. రేపు 4 యాత్రలు ప్రారంభం అవుతాయని.. ఆ తర్వాత కాకతీయ భద్రాద్రి క్లస్టర్ యాత్ర తరవాత ప్రారంభం అవుతుందని చెప్పారు. కాగా..…
Amethi: 2024 లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. అమేథీ వేదికగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకే రోజు పలు కార్యక్రమాలుకు హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఈ రోజు అమేథీ పట్టణంలోని ప్రవేశిస్తోంది. కొన్ని దశాబ్ధాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీని బీజేపీ బరిలో నిలిపి గెలిపించింది. అయితే, ఈ ఇద్దరు నేతలు కూడా ఒకేసారి అమేథికి రావడం…
BJP Vijaya Sankalpa Yatra: రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్తామన్నారు.
Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ హాయాంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీతో బీజేపీ పాలనను పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి తమ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని మమతా బెనర్జీ ఆరోపించారు.
Chandigarh Mayor Row: చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు.
ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్ఠానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అధిష్ఠానం మళ్లీ పిలిస్తేనే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని చెప్పారు. ఎప్పుడు చర్చల కోసం పిలుస్తారో తెలియదు.. చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో పురేంధేశ్వరీ పాల్గొన్నారు. దాదాపు ఏపీ నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు.