మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి గత పదేళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయం సాధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు.
Read Also: Tirumala: నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ఇక, నేడు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న బీజేపీ ప్రచారాలు, పథకాలపై నివేదిక తీసుకురావాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను జేపీ నడ్డా కోరారు. పార్టీకి 370కి పైగా సీట్లు, ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు రావాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యానికి అనుగుణంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది.
Read Also: TRAI : ఇప్పుడు ప్రతి కాల్ కి సంబంధించిన కాలర్ పేరు తెలవాల్సిందే
అందులో భాగంగానే ఇప్పటికే భారత్ మండపంలో గత వారం రోజుల క్రితం బీజేపీ జాతీయ సమావేశాలు జరిగాయి. ఇందులో అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పాటు అన్ని స్థాయిల నేతలు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలను వారికి ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా దిశానిర్థేశం చేశారు.