Akhilesh Yadav: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ రోజు ‘ ధర్మతల ర్యాలీ’ని నిర్వహించారు. కోల్కతాలో జరిగిన ఈ ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారంతో, ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోడీదని కొనియాడారు.
Amit Shah: జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో గిరిజన ప్రదేశాల్లో చొరబాట్లు పెరిగాయని, దీంతో గిరిజన జనభా తగ్గిపోతోందని ఆరోపించారు.
Jairam Ramesh: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు.
ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్ను చంపేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ షుగర్ 8 సార్లు 50 కంటే కిందకు పడిపోయిందని అన్నారు.
Amit Shah: మరి కొన్ని రోజుల్లో జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర మంత్రుల హవా పెరిగిపోయింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకోనున్నారు.
UP BJP: గత రెండు పర్యాయాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అత్యధిక ఎంపీ స్థానాలు (80) ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కీలకంగా మారింది. అయితే, 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం యూపీలో బీజేపీ చతికిలపడింది.