Lanka Dinakar: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుంది అని ఏపీ భారతీయ జనాతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది.. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు. అశాస్త్రీయ రాష్ట్ర విభజన, అస్తవ్యస్తమైన ఏపీ పునర్విభజన చట్టం వెనుక జైరాం రమేష్, చిదంబరం ఉన్నారు.. పోలవరం చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావిస్తే.. పోలవరం బాధ్యత మాది అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 5, 6, 94 లో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితం చేశారు.. కంటి తుడుపు కమిటి తప్ప స్పష్టంగా రాష్ట్రానికి ఏమి ఇవ్వాలో తెలుపకుండా బ్లాక్ చెక్ ఇచ్చారు.. అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వడంలో కేంద్రం వెనుకంజ వేయలేదు అని లంక దినకర్ తెలిపారు.
Read Also: Jishnu Dev Varma: నేడే తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..
ఇక, ఏపీ రాజధాని నిర్మాణం కోసం అందించే 15 వేల కోట్ల రూపాయల ప్రభావం 50 నుంచి 60 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది అని ఏపీ బీజేపీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రాజధానిని చెల్లని చెక్కు చెయ్యాలని తల్లి కాంగ్రెస్ చూస్తే.. పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించింది.. ఏపీ పునర్విభజనలో నిర్దిష్టంగా ఏ ప్రాజెక్టును సానుకూలంగా పూర్తి చేసేలా చట్టం తయారు చేయలేదు.. కనీస నగదు నిల్వను ఏపీకి ఉంచకుండా వచ్చే ప్రభుత్వం మీద అనిశ్చితిని తోశారు.. 2024- 25 బడ్జెట్ లో కోపర్తి- ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బడ్జెట్ 2024 – 25 విశ్లేషణలో అబద్దాలతో రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలని చూసారు.. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలు తప్పుడు ప్రచారం చేశారు.. మహాభారతంలో పాండవుల పైన కౌరవులు చక్రవ్యూహం పన్నారు.. నేడు దేశ, రాష్ట్ర అభివృద్ధి ఆపడానికి తల్లి, పిల్ల కాంగ్రెస్లు చక్రవ్యూహం పన్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ కానీ పాలనలో వివక్ష చూడకుండా అంత్యోదయ స్పూర్తితో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారు అని లంకా దినకర్ పేర్కొన్నారు.