BJP Leader: జనాభా నియంత్రణ చట్టానికి సంబంధించి రాజస్థాన్ మంత్రి జబర్ సింగ్ ఖర్రా వివాదాస్పద ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు కాదని పేర్కొన్నారు.
Amit Shah: ప్రతిపక్ష కాంగ్రెస్ టార్గెట్‌గా కేంద్ర హోం మంత్రి విమర్శలు గుప్పించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో మంగళవారం పర్యటించిన ఆయన, కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఇండియా కూటమిలో మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ ఎక్స్ ట్విట్టర్లో ఆప్ ఎంపీకి సంబంధించిన ఫొటోను పోస్టు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
BJP: ఉత్తర్ ప్రదేశ్‌లో మదర్సా విద్యార్థులకు అవార్డులు ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల నేతలు అధికార బీజేపీని విమర్శిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
KTR: మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.
BJP: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడంతో అప్పటి నుంచి ఆ పార్టీలో గుబులు మొదలైంది. దీంతో రాష్ట్రాలలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను కమలం పార్టీ నిర్వహిస్తోంది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను అంతం చేస్తారని ప్రతిపక్షాలు పుకార్లు పుట్టించాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించిందన్నారు.
ఉప ఎన్నికల ఫలితాల్లో 13 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది.. ఈ ఫలితాల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోవాలనుకుంటే మోడీ దానికి సరైన సారథి అంటూ విమర్శలు గుప్పించారు.
Adi Srinivas: హరీష్ రావును బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక.. బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గిపోయారని ఆ పార్టీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆప్ మంత్రి అతిషి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు.