Sanjay Raut: రాహుల్ గాంధీపై దాడి జరుగొచ్చని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న వారందరిపై కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ కుట్ర పరాయి దేశంలో జరుగుగోందని, ఏదైనా జరుగొచ్చని, మనందరిపై దాడి జరగొచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గత నెలలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మేమంతా ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నామని అన్నారు. మరోసారి కేంద్ర ఏజెన్సీల సాయంతో లేదా గుండాలతో తమపై దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు.
Read Also: Toofan: చివరి నిముషంలో వెనక్కి తగ్గిన విజయ్ ఆంటోనీ.. రిలీజ్ ఎప్పుడంటే?
అంతకుముందు తన ‘చక్రవ్యూహం’ ప్రసంగం తర్వాత తనపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ రోజు ఆరోపించారు. ఈడీలోని పలువురు తనపై దాడి చేయబోతున్నారని చెప్పారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వారి కోసం చాయ్, బిస్కెట్లతో వేచి ఉంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజకీయ వేధింపుల కోసం బీజేపీ ఈడీ, సీబీఐ, ఐటీలనున దుర్వినియోగం చేస్తుండటంపై వాయిదా తీర్మానాన్ని సమర్పించాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ ఈ రోజు నోటీసులు సమర్పించారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. అవినీతిపరులపై ఈడీ దాడులు చేస్తుంది, అవినీతి చేయకుంటే ఈడీ ఎందుకు దాడులు చేస్తుందని అన్నారు. వయనాడ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ విధానాలు విఫలమయ్యాయని, వయనాడ్ ఘటనపై దృష్టి మళ్లించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు.
#WATCH | Shiv Sena (UBT) leader Sanjay Raut says, " Not just Rahul Gandhi but all those who are raising their voices against govt to save the democracy, a conspiracy is being hatched against all of them. This conspiracy is being hatched in a foreign land…anything can happen,… pic.twitter.com/lHnC5QwWWB
— ANI (@ANI) August 2, 2024