Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి.. ఆశగా ఎదురు చూస్తున్న 3 పార్టీల నేతలు..!
- ఏపీలో నామినేటెడ్ పోస్టుల హడావిడి..
- ఆశగా ఎదురు చూస్తున్న 3 పార్టీలు..
- ఎవరికి ఎంత ప్రాధాన్యం అనే దానిపై ఆసక్తి..
- భర్తీ కోసం పార్టీల మధ్య ఈక్వేషన్‌కు కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. మంత్రి పదవుల పంపకం పూర్తి అయ్యింది.. ఆ తర్వాత ఎమ్మెల్సీలను కూడా షేర్ చేసుకున్నారు.. ఇప్పుడు ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల సందడి నడుస్తోంది. ఈ రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టుల జాతర ముగించేయాలనేది హైకమాండ్ ప్లాన్. మరోవైపు భర్తీలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పరిపాలన పరంగా సెక్రటేరియేట్ ఎంత బిజీగా ఉంటుందో.. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూటమి పార్టీల నేతలూ అంతే బిజీగా ఉంటున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నానినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ జరుగుతోంది.
Read Also: Off The Record : ఆళ్లగడ్డలో అఖిలప్రియ vs శిల్పా చక్రపాణి రెడ్డి
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
కొందరు ఎమ్మెల్యేలు సహా టిక్కెట్లు దక్కించుకోలేని చాలా మంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని.. నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా ప్రయార్టీ లభిస్తుందనేది జనసేనలో జరుగుతున్న చర్చ. ఇటు తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ కూడా భావిస్తోంది. ఇలా చూసుకుంటూ పోతే ఆశావహులు భారీగానే ఉన్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూటమి పార్టీల మధ్య బంధం మరింత బలపడేలా ఉండాలనే కానీ.. బలహీనపడడానికి బీజాలు పడేలా ఉండకూడదనే భావన మూడు పార్టీల్లో ఉంది. ఓవరాల్‌గా చూస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం పార్టీల మధ్య ఓ ఈక్వేషన్ తేవాలనే ఆలోచన చేస్తున్నట్టు సమచారం. దానికి అనుగుణంగా పదవుల భర్తీ జరిగితే ఇబ్బంది ఉండదని భావిస్తోంది కూటమి. దీనికోసం ఎలాంటి కసరత్తు చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?