Adhir Chowdhury: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ అధిర్ రంజర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బెంగాల్‌లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కాంగ్రెస్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే అధిర్ రంజన్ చౌదరి బీజేపీలోకి వెళ్లొచ్చని చెప్పింది. తృణమూల్ నేత కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. అధీర్ చౌదరి బహిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీలో చేరతారని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ.. అధిర్ రంజన్ మా పార్టీకి చెందిన వ్యక్తికాదు, ఆయన మా పార్టీలోకి రావాలని మేము కోరుకోవడం లేదని, ఆయన ఇతర పార్టీలతో మాట్లాడుతున్నారని చెప్పారు.
Read Also: Average Student Nani: హీరో డీగ్లామర్‌గా ఉండాలని నేనే చేసేసా.. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల అధిర్ రంజన్‌ని పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రెండు తీర్మానాలను ఆమోదించాలని కోరుతున్నందున పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకుల సమావేశాన్ని పిలవాలని AICC ద్వారా నాకు సమాచారం అందించబడింది. ఆ సమావేశం నా అధ్యక్షతన జరిగిందని మరియు నేను ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నానని నాకు తెలుసు. అయితే సమావేశంలో గులాం అలీ మీర్ మాట్లాడుతూ, ఆ సమయంలో మాజీ అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉన్నారని, నేను (పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్) మాజీ అధ్యక్షుడిని అయ్యానని నాకు తెలిసింది’’ అని అధిర్ రంజన్ అన్నారు.
అధిర్ రంజన్‌ని తొలగించడాన్ని టీఎంసీ స్వాగతించింది. దీనికి ముందే ఆయనను దూరం పెట్టాల్సిందని చెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ముందుగా మమతా బెనర్జీ, కాంగ్రెస్‌తో కలవాలని అనుకున్నప్పటికీ, అధిర్ రంజన్ వల్ల పొత్తు చెడిపోయిందని టీఎంసీ చెబుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ నుంచి పోటీ చేసిన అధిర్, ఆ స్థానంలో ఓడిపోయారు. బెంగాల్‌లో కాంగ్రెసన్ కేవలం ఒకే స్థానంలో గెలిచింది.