PM Modi: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ‘హత్య’, ‘హింస’ అనే పదాలను ఉపయోగించరాని పేర్కొంది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ.. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు హింసను ప్రేరేపిస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి రాసిన లేఖను బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది హైలెట్ చేశారు.
Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కొన్ని అరాచక శక్తులు మా ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
Bengaluru mall: ధోతీ ధరించిన రైతుని మాల్కి నిరాకరించిన బెంగళూర్ ఘటన యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ధోతీ ధరించాడని చెబుతూ రైతుని, అతని కొడుకుని సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ జీటీ మాల్‌లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్ బద్ధవ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు.
UP BJP: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఘోర పరాజయం చూసింది. 2014, 2019 ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేసిన ఆ పార్టీ, 2024 ఎన్నికల్లో మాత్రం దారుణమైన ఫలితాలను చూసింది.
Bengaluru: ధోతి ధరించాడనే కారణంతో ఓ వృద్ధుడు, అతని కొడుకుని మాల్‌లోకి అనుమతించని ఘటన బెంగళూర్‌లో చోటు చేసుకుంది. జీటీ మాల్లోని థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకుంది.
RSS: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీకి సొంతగా మెజారిటీ రాకపోవడానికి పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఘోరమైన ప్రదర్శనకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణమని ఆర్ఎస్ఎస్ విమర్శించింది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
UP BJP: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రదర్శన ఆ పార్టీలో విబేధాలకు కారణమైనట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మెజారిటీ సీట్లను దక్కించుకున్న బీజేపీ, 2024లో మాత్రం దారుణమైన ఫలితాలను చవిచూసింది.