DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో పెట్టే కుట్ర జరుగుతోందని శుక్రవారం అన్నారు. బెంగళూర్ శివారులో బీజేపీ పాదయాత్రను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ‘‘జన ఆందోళన్ సభ’’ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు తెలుసు. వారిని చేయనివ్వండి. పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా స్వభావం, సామర్థ్యం ఉన్న ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై వియేంద్ర చేసిన మోసాలను బయటపెడతాను. అతనికి సత్తా ఉంటే నేను అవినీతికి పాల్పడిన విషయాలు చెప్పనివ్వండి. ఏ ప్రాతిపదికన నన్ను అవినీతి పితామహుడు అని అంటారు..?’’ అని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Covid Vaccines: కోవిడ్ వ్యాక్సిన్‌ల కోసం రూ. 36 వేల కోట్లు.. ప్రజలు ఎన్ని డోస్‌లు తీసుకున్నారంటే..?
బీజేపీ చేపట్టిన పాదయాత్రలో జేడీఎస్ ప్రాతినిధ్యం లేకపోవడాన్ని శివకుమార్ లేవనెత్తారు. ‘‘ కుమారస్వామి.. మీ నాన్నగారు ఈ జిల్లాకు వచ్చి నా కర్మభూమి, పుణ్య భూమి అంటూ కుటుంబమంతా సత్తా చాటారు. మీ నాన్న ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి, ప్రధాని అయ్యారు. మీ అమ్మమ్మ ఈ జిల్లాలో ఎమ్మెల్యే అయింది. మీరు ఈ భాగం నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించారు. అయితే మీ పార్టీ జెండా లేకుండా ఈ పాదయాత్ర చేస్తున్నారు. మీకు ఆత్మ గౌరవం ఉందా..?’’ అని ఎద్దేవా చేశారు.