Amritpal Singh: లోక్సభ వేదికగా ఖలిస్తానీ మద్దతుదారు, ఎంపీ అమృత్పాల్ సింగ్కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మద్దతు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఖలిస్తాన్కి మద్దతు ఇస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అమృత్పాల్ని జాతీయ భద్రతా చట్టాల కింద అరెస్ట్ చేశారు.
BJP MP Nishikant Dubey: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని గురువారం ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు అని దుయ్యబట్టారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న ఆయన.. అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయి అని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిల్చొవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడంతో అసెంబ్లీలో దాదాపు 80 శాతం మంది ఎమ్మెల్యేలు.. సభలో లేచి నిల్చున్నారు.. దీంతో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి..
BJP MLAs Slept Inside Assembly: కర్ణాటక రాజకీయాల్లో బుధవారం ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర సహా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే నిద్రించారు.
Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఎన్నికను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు.