Maharashtra: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. 288 స్థానాలు ఉన్న మహా అసెంబ్లీలో బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) పార్టీలు ‘మహాయుతి’ పేరుతో కూటమిగా పోటీ చేయబోతున్నాయి.
J&K Terror Attacks: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి పాల్పడుతున్న వారు జైలుకు వెళ్తారు లేదా ‘నరకానికి’ వెళ్లారని రాజ్యసభలో కేంద్రం హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం సమాధానమిచ్చారు. ఉగ్రవాదాన్ని మోడీ సర్కార్ సహించబోదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. నేను మాట్లాడటానికి మూడు సార్లు లేచానని, కాంగ్రెస్ – బీ ఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే నన్ను మాట్లాడనివ్వకుండ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారన్నారు. గత బడ్జెట్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజక వర్గానికి మీరు ఇచ్చినప్పుడు అది మిగతా జిల్లాలను విస్మరించడమేనా? అని ఆయన ప్రశ్నించారు.…
DMK Leader: శ్రీరాముడిపై డీఎంకే మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే నేత, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్ రెగుపతి మాట్లాడుతూ.. శ్రీరాముడు ‘‘ద్రావిడ నమూనాకు ఆద్యుడు’’ అని అన్నారు. సోమవారం కంబన్ కజగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాముడు సామాజిక న్యాయ పరిరక్షకుడు అని ఆయన అన్నారు.
కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని ఆయన తెలిపారు. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. సబ్ కే సాథ్ సబ్ కా…
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీనిని కాపీ పేస్ట్ బడ్జెట్గా అభివర్ణించింది.
Telangana Assembly Session: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు స్టార్ట్ కానున్నాయి. శాసనమండలి సమావేశాలు రేపు( జులై 24) ఉదయం 10 గంటలకుయ ప్రారంభమవుతాయి.
BJP: మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి శరణు కోరి వచ్చే ప్రజలకు బెంగాల్ అండగా నిలుస్తుందని, వారికి ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. మమతా చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది.
Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహాయుతి కూటమిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పొత్తులో ఉన్నాయి.