Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు.
Robert Vadra : రైతుల నిరసనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆమెను టార్గెట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ముంబై, పాల్ఘర్లలో పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2024 ప్రారంభ సెషన్‌కు ప్రధాని హాజరవుతారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు గురువారం బిగ్ రిలీఫ్ లభించింది. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
మండి ఎంపీ కంగనా రనౌత్ కు విపక్షాల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. సొంత పార్టీ బీజేపీ కూడా కంగనా వ్యాఖ్యలను ఖండించింది. తాజాగా ఆమెపై పంజాబ్ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) నేత సిమ్రాన్‌జీత్‌సింగ్ మాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) నేత సిమ్రంజిత్ సింగ్ మాన్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ఎంపీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు దీనిపై కంగనా రనౌత్ ప్రకటన కూడా బయటకు వచ్చింది. అకాలీదళ్ నేతపై ఎదురుదాడికి దిగిన ఆమె.. అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైందని ఎక్స్ లో పేర్కొన్నారు. READ MORE: Andhra Pradesh: మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్…
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్ని మమతా బెనర్జీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం జరిగిన నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మమతా బెనర్జీపై బీజేపీ విమర్శల దాడిని ఎక్కువ చేసింది.
కొల్లం గంగిరెడ్డి వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి.. జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం.. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలన్నారు.