Minister Satya Kumar Yadav: రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉండగా 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని ఆరోపించారు . దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని అన్నారు. మేం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే.. మీరు ఐదేళ్లు పులివెందులలో ఆసుపత్రి కట్టారు, కళాశాలలు కట్టలేదని విమర్శించారు. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, కళాశాల నిర్మాణం కాకుండా, వసతులు లేకుండా విద్యా ప్రమాణాలను ఎలా ప్రారంభించాలని ప్రశ్నించారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వైద్య కళాశాల నిర్మాణంలో ఉందని, ఎన్ఎంసీకి నివేదికలు ఇచ్చారని తెలిపారు.
Read Also: D. Sridhar Babu: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రచారం చేస్తున్నారు..
వైద్యవిద్య అందించాలంటే ప్రమాణాలుంటాయని, వాటిని పాటించకుండా చేస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకున్నట్టేనని వ్యాఖ్యానించారు సత్యకుమార్ యాదవ్.. వైద్య విద్యకోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు దీనిపై అవగాహన చేసుకోండని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 12 కళాశాలలో రాబోయే ఏడాదికి విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక, మద్యంపై 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పుపెట్టివెళ్లిందని గుర్తు చేశారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మీద ముందుగానే అప్పు చేసిన ఘనత జగన్ దేనని ఆరోపించారు. 13 సార్లు గత ప్రభుత్వంలో ఆరోశ్యశ్రీ మీద నోటీసులు ఇచ్చాయని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 2500 కోట్లు బకాయిలు పెట్టింది వెళ్లిందని, 652 కోట్లు మేం బకాయిలు చెల్లించామని వివరించారు. అధికారంలోకి వచ్చిన ౩ నెలలోనే వేలాది కోట్లు బకాయిలు చెల్లించడం భారమే, కానీ, గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని అన్నారు. సదరన్ సర్టిఫికేట్ల అంశంలో సర్వే జరుగుతుందని, తప్పుడు సర్టిఫికేట్లు పెట్టినవారి పెన్షన్‌లు తొలగిస్తామని.. ఎవరైన ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తేలితే వైద్యులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి సత్యకుమార్.