సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ మీటింగ్‌లో బీజేపీ ఇంచార్జీ అభయ్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయ్ పాటిల్ మాట్లాడుతూ.. మీటింగ్ ప్రారంభానికి ముందే అందరూ ఫోన్లు ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండని, ఎవరికైనా మెసేజ్ కాల్ వస్తే.. నేను బయటకు పంపించేస్తామన్నారు. ఆ తర్వాత బయటకు పంపించానని చెప్పొద్దని, నేను ఒక్కసారే చెబుతానన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన సందర్భంలో కొందరిని బయటకు పంపించానని, నన్నెవరు ఏం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీరు ఉండకండి ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నేను వాళ్ల శిష్యుడిని.. వీళ్ల శిష్యుడిని అని కబుర్లు చెప్పొద్దని, మనమంతా పార్టీ, మోడీ శిష్యులమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మాట్లాడుకునే సమయం కాదు.. పార్టీ సభ్యత్వాలను పెంచుకునే సమయం అని, అందరికీ హిందీ అర్థమవుతుంది కదా.. లేదంటే వారిని బయటకు పంపించేస్తా.. ఆ తర్వాత వారి పరువు పోతుందని అని ఆయన వ్యాఖ్యానించారు.
Arekapudi Gandhi: కౌశిక్ మాటలకు నా మనసు బాధ పడే ఆవేశపూరితంగా మాట్లాడా: అరికెపుడి
అంతేకాకుండా..’ఇక్కడ కూర్చుని కోల్గెట్ అడ్వర్టైజ్ లో చేసినట్లుగా కబుర్లు పెట్టొద్దు. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పండి లేదా స్టేజీపై ఉన్న వారికి చెప్పండి. కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరికీ సభ్యత్వ టార్గెట్ పెట్టాం. నేను ఐదుసార్లు ఎమ్మెల్యేను.. ఆరు సార్లు ఎమ్మెల్యేను నేను సభ్యత్వాలు నమోదు చేయాలా? అనే కబుర్లు చెప్పొద్దు. ఎవరు ఎంత మంది సభ్యత్వాలు చేశారు అన్నది నాకు ముఖ్యం. వచ్చే పది రోజుల్లో మళ్లీ వస్తాను.. అప్పటికీ మీకు ఇచ్చిన టార్గెట్ లో 50 శాతం పూర్తిచేయకుంటే మీ పదవులు పోతాయ్.. పార్టీ పదవి ఇచ్చిందంటే పార్టీకి పనిచేయాలి. అంతేకాని విజిటింగ్ కార్డుల్లో పార్టీ పదవి ప్రింట్ చేసుకుని పైరవీలు చేస్తూ తిరగొద్దు.. నేను మీ చప్పట్ల కోసం రాలేదు.. సభ్యత్వ నమోదు కోసం వచ్చాను. ప్రతి జోన్ లో తమకు ఇచ్చిన టార్గెట్ కంటే ఒక సభ్యత్వం ఎక్కువగానే చేయాలి. ఈ పది రోజులు ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున పార్టీకి పనిచేస్తే టార్గెట్ ను రీచ్ అవ్వొచ్చు. మళ్లీ వచ్చే మీటింగ్ లో పెద్ద నేతలు ఎంత మంది సభ్యత్వాలు చేశారో మీకు చెబుతాను..
దాన్ని బట్టి మీరు ఎంత కష్టపడి ఎన్ని సభ్యత్వాలు చేశారనేది మీకు తెలుస్తుంది. మీకు పంపు కొట్టి మీతో చప్పట్లు కొట్టించుకోవాలనుకునే నేతను నేను కాదు. వినాయక నిమజ్జనం రోజు కూడా సమయం వృథా చేయొద్దు.. ఉదయం పనిచేసి సాయంత్రం నిమజ్జనం చేసుకోవచ్చు. ఎవరి నేతకైనా విద్యాసంస్థ ఉంటే అందులో పనిచేసేవారికి సభ్యత్వాలు ఇచ్చి నా టార్గెట్ పూర్తయిందని చెప్పకండి.. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను.. వారికి కూడా సభ్యత్వం ఇవ్వండి.. కానీ ప్రజల్లోకి వెళ్లండి.’ అని మాట్లాడుతుండగా.. సమావేశం మధ్యలో ఓ నేత ఫోన్ కాల్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఇదేమైనా మేళా అనుకుంటున్నావా? అని నేతకు సభ వేదికపై నుంచే క్లాస్ ఇచ్చారు అభయ్ పాటిల్.