BJP: సీజేఐ ఇంట్లో “గణపతి పూజ”కు పీఎం మోడీ.. విమర్శలకు “ఇఫ్తార్ విందు”తో బీజేపీ సమాధానం..
- సీజేఐ ఇంటిలో గణపతి పూజకి ప్రధాని మోడీ..
- రాజకీయ విమర్శలకు దారి తీసిన ఘటన..
- ఇఫ్తాన్ విందులో బీజేపీ సమాధానం..
- మన్మోహన్ సింగ్ నిర్వహించిన కార్యక్రమానికి అప్పటి సీజేఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రధాని నరేంద్రమోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గణపతి పూజ సందర్భంగా మోడీ, చంద్రచూడ్ ఇంటికి వెళ్లారు. గణపతి పూజలో సీజేఐ దంపతులతో కలిసి ఉన్న ఫోటోని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఆర్జేడీ వంటి ఇండియా కూటమి నేతలు ప్రధాని వెళ్లడాన్ని తప్పుపడుతున్నాయి.
Read Also: Sangareddy: కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే, బీజేపీ కూడా అంతే ధీటుగా ఇండియా కూటమి నేతలకు బదులిస్తోంది. ‘‘గణపతి పూజ’’ విమర్శలకు ‘‘ఇఫ్తార్ విందు’’తో సమాధానం ఇచ్చింది. ప్రతిపక్షాలు ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’గా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపించింది. 2009లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన నివాసంలో ఇఫ్తార్ పార్టీకి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరైన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. ఆనాటి ఫోటోలను పంచుకున్నారు.
‘‘2009లో పీఎం మన్మోహన్ సింగ్ ఇఫ్తార్ పార్టీకి అప్పటి సీజేఐ కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారు..ష్‌ష్- ఇది సెక్యులరిజం.. న్యాయవ్యవస్థ సురక్షితం. పీఏ మోడీ ప్రస్తుతం సీజేఐ ఇంట్లో గణపతి పూజకు హాజరయ్యారు. ఓ మై గాడ్ ఇది న్యాయవ్యవస్థ కాంప్రమైజ్ అయింది’’ అని పూనావాలా వ్యంగ్యంగా ట్వీట్ చేసి, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. 2009లో న్యూఢిల్లీలో ప్రధానిమంత్రి నివాసంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి మన్మోహన్ సింగ్‌తో పాటు ఆయన భార్య గురుశరణ్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు అప్పటి బీజేపీ చీఫ్ లాల్ కృష్ణ అద్వానీ, సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, రాష్ట్రీయ జనతాదళ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!