NDA: పార్లమెంట్ రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 స్థానాలకు గానూ 9 మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈ రోజు మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది, కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.
ఈ ఘటనలో నిందితులకు సీఎం మమతా బెనర్జీ రక్షణ కల్పిస్తున్నారని బీజేపీ మంగళవారం ఆరోపించింది. సీబీఐ ఆమెకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. కోల్‌కతాలో జరిగిన ఆందోళనల్లో నిరసరకారులపై లాఠీచార్జిపై స్పందించిన బీజేపీ.. మమతా బెనర్జీని నియంతగా అభివర్ణించింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో గాయత్రి నగర్‌లోని పురంధేశ్వరి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
Mallikarjun Kharge: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్, ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వరసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజకీయాలను ‘‘ముడా’’ స్కామ్ సంచలనంగా మారింది. ఇందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య ప్రమేయం ఉండటంతో బీజేపీతో పాటు జేడీఎస్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎంపై విచారణకు కర్నాటక గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంతో, ఆ తర్వాత హైకోర్టు దీనిపై స్టే విధించడం జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
Bomma Mahesh Kumar Goud: కనిత కు బెయిల్ ఊహించిందే అని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని తెలిపారు.
Champai Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరిక ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ (ట్వీటర్) వేదికగా సోమవారం అర్ధరాత్రి ఒక పోస్ట్ చేశారు.
జమ్మూకశ్మీర్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించనున్నారు. కాగా.. బీజేపీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్లలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
హిమాచల్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైతుల ఉద్యమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన తర్వాత.. ప్రతిపక్షాలు బీజేపీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని కంగనాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం బీజేపీ విడుదల చేసింది. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య ఈ జాబితాను ఉపసంహరించుకుంది. కొన్ని గంటల తర్వాత సవరించిన జాబితాను మళ్లి విడుదల చేసింది.