హర్యానా బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. పలువురు సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో నేతలు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.
Brij Bhushan Sharan Singh: రెజ్లింగ్ బాడీ చీఫ్గా ఉన్న సమయంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరన్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భారత ఏస్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి వారు ఆందోళనలు చేశారు.
Shivraj Singh Chauhan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపు కారణంగా బుడమేరు వాగు పొంగి కేసరపల్లి దగ్గర పంట పొలాలు ముంపుకు గురి కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా పురోగతి లభించలేదు. దీంతో ఈ కేసుపై రోజుకో వదంతు వ్యాప్తి చెందడంతో అయోమయం నెలకొంది. దర్యాప్తుపై సందిగ్ధం నెలకొంది. తాజాగా బాధిత కుటుంబం.. పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం నూతన మహిళా కమిషన్లో వైస్ఛైర్పర్సన్గా నియమించడంపై ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మసీదు నిర్మాణం వివాదాస్పదమవుతోంది. మసీదును అక్రమంగా నిర్మిస్తు్న్నారని సిమ్లాలో స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఈ రోజు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని సంజౌలిలోని మార్కెట్ పక్కనే నిర్మిస్తున్న మసీదు చట్టవిరుద్ధంగా ఉందని, అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ(బీజేపీలో) చేరారు. సెప్టెంబర్ 02న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజీ పంచుకున్నారు. రవీంద్ర జడేజా బీజేపీలో చేరినట్లు ఆమె ఫోటోని పోస్ట్ చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ్టి ( గురువారం) నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.
వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు.. వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెజవాడ పోలీసులు.. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాలలోని బాధితులు లేదా ప్రజల వద్ద నుండి సదరు…
West Bengal BJP: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార, హత్య ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు.