ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్, ఫరక్కాబాద్ లాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.. మహిళలపై నేరాల విషయంలో యూపీ ముందువరసలో ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సరిగ్గా పని చేయకపోవడంతో మహిళలపై వేధింపులు భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం వాయిదా వేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్రంలో వర్ష పరిస్థితులపై మోడీ, అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారని వెల్లడించారు. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించిందన్నారు.
భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీకి అండగా నిలుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సభ్యత్వ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సమయంలో.. ప్రధాని మోడీ బీజేపీలో మరోసారి సభ్యత్వం తీసుకున్నారు.
Swati Maliwal Assault Case: లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోనే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మే 13న దాడి జరిగితే మే 18న బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Eknath Shinde: సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు గుప్పిస్తోంది.
Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై ఏక్నాథ్ షిండే-బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)ల సర్కార్ ‘మహాయుతి’పై విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే- ఎన్సీపీ శరద్ పవార్)ల కూటమి విరుచుకుపడుతోంది. ఈ రోజు ఎంవీఏ కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. విగ్రహం కూలిపోవడంపై ప్రభుత్వాన్ని నిందిస్తోంది.
Robert Vadra: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై కంగనా చేసిన వ్యాఖ్యలను రాబర్ట్ ఈ సందర్భంగా మండిపడ్డారు.
Farmers Protest 200 Days: పంజాబ్-హర్యానా శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం నేటికి 200 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది తరలివస్తారని పేర్కొంటూ సరిహద్దులో రైతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కు రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరుకోనున్నారు.