Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) పార్టీకి రాజీనామా చేశారు. తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఈ రోజు రాజీనామా చేశారు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. వచ్చే నెల ఆఖరులో మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరగబోయే తొలి ఎన్నికలు ఇవే. ఇదిలా ఉంటే, కాశ్మీరీ కీలక నేత, మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్టీ ఎజెండాను అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు.…
ఎన్నికల ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించుకున్నందుకు హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. బీజేపీ హర్యానా అనే హ్యాండిల్ ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్లో కలకలం రేగుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం కేసుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి మాట్లాడుతూ..
బెయిల్ మీద విడుదలైన కవిత.. శశికళలా ఆవేశపడి బీజేపీ పెద్దలపై స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటే.. ఏ కేసీఆర్నో.. ఏ కేటీఆర్నో అరెస్ట్ చేసేవాళ్లమన్న ఆయన.. కానీ, కవిత చేసిన చెడుసావాసాల వల్లే ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు.. వాస్తవాలు తెలుసుకోకుండా శశికళల ఆవేశపడి పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తే ఆమెకే నష్టమన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనే వార్తలు…
J-K Assembly Election: జమ్మూ కాశ్మీర్లోని ఏడు జిల్లాల్లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 279 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక్కడ సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది.
బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు. ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్లో 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు.
Champai Soren: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరడం ఖరారైంది. బీజేపీలో చేరాలనే తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రకటించారు. గిరిజనుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీనే అని అన్నారు. సంతాల్ పరగణాలో గిరిజనులు గుర్తింపును రక్షించేందుకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, గిరిజన హక్కుల కోసం పాటుపడాలని తన మద్దతుదారుల్ని కోరారు. చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న బీజేపీలో…