హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపింది. కానీ చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇంకోవైపు సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది మాత్రం తేలలేదు. మొత్తానికి ప్రతిష్టంభన మధ్య ఆప్ సోమవారం తొలి జాబితాను విడుదల చేసేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.
Rahul Gandhi: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. డాలస్‌లోని ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మభ్యపెట్టి, ఆశపెట్టి సభ్యత్వ నమోదు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ మిగతా పార్టీలకు తేడా ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు చేస్తే ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ కన్నా.. దేశమే గొప్పదని చెప్పే పార్టీ కేవలం బీజేపీ మాత్రమే…
Brij Bhushan: రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వీరి చేరిక తమ పార్టీకి బలంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అవినీతి విషయంలో కళ్ళు తెరిచి చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Afzal Guru: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుని ఉరితీయడం వల్ల ఏం ప్రయోజనం లేదని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది.
Haryana Assembly Elections: హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న తిరుగుబాటు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి సీనియర్ నాయకుడు రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు.
‘‘ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అదినాయకత్వం భావిస్తోంది.
Shimla Mosque Row: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను సిమ్లా మసీదు నిర్మాణం కుదిపేస్తోంది. అక్రమంగా ఈ మసీదును నిర్మిస్తున్నారని అధికార కాంగ్రెస్‌కి చెందిన మంత్రి అనిరుద్ధ్ సింగ్ ఏకంగా అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రచ్చకు కారణమైంది. ఇంతే కాకుండా మసీదు ఉన్న ఏరియాలో దొంగతనాలు, లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయన్న మంత్రి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి.