జమ్మూకాశ్మీర్‌లో బుధవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 24 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసేలా భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Supreme Court: బెంగాల్ సర్కార్‌కు చుక్కెదురు.. వైద్యురాలి కేసులో లైవ్ స్ట్రీమ్ పిటిషన్ కొట్టివేత
జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. అంతేకాకుండా ఆయా పార్టీలు మేనిఫెస్టోలు కూడా విడుదల చేశాయి. ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఆయా పార్టీలు అధికారంపై ధీమా వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: Tirupati: మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిపై థియేటర్‌లో హత్యాయత్నం.. నిందితులు అరెస్ట్
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో 219 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 23 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ప్రకారం.. ఫేజ్ 1లో మొత్తం 23,27,580 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. భద్రతా ఏర్పాట్లలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలిటరీ ఫోర్సెస్ (సిఎపిఎఫ్), జమ్మూ కాశ్మీర్ ఆర్మ్‌డ్ పోలీసులు మరియు జెకె పోలీసుల నుంచి బహుళ-స్థాయి బలగాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
#WATCH | J&K elections | Preparations underway at the polling stations ahead of the first phase of polling, scheduled for tomorrow. Visuals from a polling station in Pulwama
24 Assembly constituencies across the UT will go to polls in the first phase, scheduled for 18th… pic.twitter.com/EjUVdIxGto
— ANI (@ANI) September 17, 2024