Rajnath Singh : దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం 'బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ కాంక్లేవ్'లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హయాంలో సరిహద్దు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఆయన వెలుగులోకి తెచ్చారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడుతున్నాడని బీజేపీ మండిపడుతోంది. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండీ, భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ అమెరికా శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో భేటీ అయ్యారు.
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాక కుటుంబం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వినేష్ పెద్దనాన్న మహవీర్ ఫోగట్ స్పందిస్తూ.. వినేష్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తదుపరి ఒలింపిక్స్‌పై గురి పెట్టకుండా రాజకీయాల్లో రావడం చాలా పెద్ద తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె బంధువు, బీజేపీ నేత బబిత ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై నిప్పుల చెరిగారు.
Sushilkumar Shinde: మాజీ కేంద్ర హోం మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ హాయాంలో 2012లో షిండే కేంద్ర హోం మంత్రిగా ఉన్న సమయంలో తన శ్రీనగర్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. మంగళవారం, ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ని సందర్శించినప్పుడు తానను భయపడ్డానని వెల్లడించారు.
హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. లాడ్వా నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. మంగళవారం పార్టీ ఆఫీసులో పూజ నిర్వహించి.. అనంతరం ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి సైనీ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. మంగళవారం తొమ్మిది మందితో కూడిన రెండో జాబితాను ఆప్ విడుదల చేసింది. సోమవారం 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజా జాబితాతో కలిపి మొత్తం 29 స్థానాలకు అభ్యర్థులను ఆప్ వెల్లడించింది.
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కోర్టు తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు శునకానందాన్ని పొందుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తే నీతి.. వేరే వాళ్ళు చేస్తే అవినీతి అన్నట్టు ఉందని విమర్శించారు. అనర్హత వేటు పడుతుంది.. ఉప ఎన్నికలు వస్తాయి.. ఇవ్వన్నీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదని వ్యాఖ్యానించారు.
BJP: అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ‘‘సిక్కులు భారతదేశంలో తలపాగా ధరించడానికి, గురుద్వారాని సందర్శించడానికి అనుమతించబోతున్నారా లేదా అనేదానిపై పోరాటం’’ అంటూ వ్యాక్యలు చేశారు. వర్జీనియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ...‘‘ భారతదేశంలో సిక్కులు తలపాగా ధరించాడానికి అనుమతిస్తున్నారా..?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ రెండు లిస్టులను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం మరో జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మూడు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.