Minister Tummala: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం.
Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు.
దాదాపు గంట క్రితం ఓ ర్యాలీలో పాల్గొని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులకు ఓట్లు వేయాలని అడిగిన నాయకుడు కట్‌చేస్తే కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీతో ప్రత్యక్షమయ్యారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా కల్పించారు మూసీ సుందరీకరణలో నిర్వాసితులవుతున్న కుటుంబాలను బాధితులను పరామర్శించారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ నుంచి తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకు బస్తీల్లో నిర్వాసితులను స్వయంగా కలిసి, వారి గోడును ఆవేదనను విన్నారు.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని కాంగ్రెస్ చెప్తుంది.. కానీ, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడైనా చెప్పిందా అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉండే పార్టీ కాంగ్రెస్.. హర్యానా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించగలదా..? అని ఆయన ప్రశ్నించారు.
‘డేరా సచ్చా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌కు ఎలక్షన్ కమిషన్ సోమవారం ఆమోదం తెలిపింది. దీనిపై హర్యానా కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈరోజు (మంగళవారం) ఈసీకి లేఖ రాసింది.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కుర్చీల కొట్లాట జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. మీ కుర్చీల కోట్లలో మమ్ములను ఎందుకు లాగుతారన్నారు. బీజేపీలో ఈటలను అయినా ఇంకెవ్వరినైనా అధ్యక్షునిగా పెట్టుకోండి నాకెందుకని, నన్ను విమర్శ చేస్తే పడను.. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతా అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో నేను ఉన్నాను… మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు…
కాంగ్రెస్ పార్టీ హామీలపై ఆందోళనను వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో మోసపూరిత హామీలు చెపుతోందని, “గ్యారంటీ” అనే పేరుతో ప్రజలను మోసపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మోసపూరిత హామీలతో ఓట్లు వేసుకుని గెలిచాక, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అనేక కారణాలు చెప్పి, నిర్లక్ష్యంగా చుక్కలు చూపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఈ గ్యారంటీలను అమలు చేయడం కాకుండా, “హైడ్రా” అనే పేరుతో ఇతర అంశాలకు దృష్టి…
ప్రధాని నరేంద్ర మోడీ అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రచార ర్యాలీలో అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కొనసాగించిన సందర్భంగా ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
Uddhav Thackeray: ప్రతిపక్ష నేతల్ని దెబ్బతీయాలని బీజేపీ నాయకులకు ఆదేశాలు అందాయని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, ఎన్సీసీ(ఎస్పీ) శరద్ పవార్లను లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ నేతలకు క్లోజ్ డోర్ మీటింగ్‌లో అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని అన్నారు.